AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Donation: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. కుమార్తెకు కిడ్నీ దానం చేసిన 85 ఏళ్ల మహిళ

ఆపరేషన్ తర్వాత 84 ఏళ్ల తల్లిని యూరాలజీ ఐసియులో ఉంచారు. అయితే, ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శస్త్రచికిత్స తర్వాత కేవలం మూడు రోజులకే ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కుమార్తె పరిస్థితి కూడా స్థిరంగా ఉంది. మార్పిడి  చేసిన మూత్రపిండం బాగా పనిచేస్తోందని, ఆమె త్వరలోనే సాధారణ జీవితానికి తిరిగి రావచ్చునని వైద్యులు వెల్లడించారు.

Kidney Donation: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. కుమార్తెకు కిడ్నీ దానం చేసిన 85 ఏళ్ల మహిళ
Kidney Donation
Jyothi Gadda
|

Updated on: May 29, 2025 | 8:55 AM

Share

ఒక తల్లి కేవలం జన్మనివ్వడమే కాదు.. అవసరమైతే ఆమె తన శ్వాసను కూడా తన బిడ్డకు బదిలీ చేస్తుంది. అలాంటి ఒక ఉదాహరణ జైపూర్‌కు చెందిన 84 ఏళ్ల తల్లి. ఆమె తన శరీరంలోని ఒక భాగాన్ని దానం చేయడం ద్వారా తన కూతురికి రెండోసారి జన్మనిచ్చింది. అవును..కుమార్తె ప్రాణాలను కాపాడటానికి 85 ఏళ్ల మహిళ కిడ్నీ దానం చేసి తల్లి ప్రేమను చాటుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపుర్‌లో చోటుచేసుకుంది. భరత్‌పూర్‌లో నివసిస్తున్న 85 ఏళ్ల వృద్ధ మహిళ బుద్ధో దేవి తన కుమార్తె గుడ్డి దేవికి తన కిడ్నీని దానం చేసింది.

భరత్‌పూర్‌లో నివసిస్తున్న 85 ఏళ్ల వృద్ధ మహిళ బుద్ధో దేవికి 50 ఏళ్ల కుమార్తె ఉంది.. గత కొంతకాలంగా ఆమె దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD)తో బాధపడుతోంది. ప్రతి మూడు రోజులకు ఒకసారి ఆసుపత్రిలో డయాలసిస్ చేయాల్సి వస్తుంది. దీంతో ఆ మహిళ ఆరోగ్యం మరింత క్షిణిస్తూ వస్తోంది. నెమ్మదిగా ఆమె లేవలేని స్థితిలోకి వెళ్లిపోతోంది. జీవితంపై ఆశ తగ్గిపోతోంది. పరిస్థితి మరింత కష్టంగా మారడంతో వైద్యులు కిడ్నీ మార్పిడి అవసరమని సూచించారు. దీంతో బుధో దేవి ముందుకు వచ్చి తన కిడ్నీని దానం చేయడానికి సిద్ధమయ్యారు. హృదయాల్ని హత్తుకునే ఈ సంఘటన ఇటు వైద్యం, మాతృత్వం రెండింటికీ కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది.

ఆపరేషన్ తర్వాత 84 ఏళ్ల తల్లిని యూరాలజీ ఐసియులో ఉంచారు. అయితే, ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శస్త్రచికిత్స తర్వాత కేవలం మూడు రోజులకే ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కుమార్తె పరిస్థితి కూడా స్థిరంగా ఉంది. మార్పిడి  చేసిన మూత్రపిండం బాగా పనిచేస్తోందని, ఆమె త్వరలోనే సాధారణ జీవితానికి తిరిగి రావచ్చునని వైద్యులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..