AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: నక్కతోక తొక్కిన డ్రాగన్ కంట్రీ.. బయటపడ్డ వెయ్యి టన్నుల బంగారం కొండ.. లెక్కలు చూస్తే

చైనా నక్క తోకను గట్టిగా తొక్కేసినట్లుంది. లేకపోతే.. 1000 టన్నుల బంగారు ఖనిజం లభించడం అంటే మాటలా? చైనాలో మరో భారీ బంగారు గని బయటపడటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. చైనా హునాన్ ప్రావిన్స్‌లోని పింగ్జియాంగ్‌ కౌంటీలో ఈ భారీ బంగారు గని ఉన్నట్టు హునాన్‌ ప్రావిన్స్‌ జియోలాజికల్‌ బ్యూరో ప్రకటించింది.

Gold: నక్కతోక తొక్కిన డ్రాగన్ కంట్రీ.. బయటపడ్డ వెయ్యి టన్నుల బంగారం కొండ.. లెక్కలు చూస్తే
Gold Mines
Ravi Kiran
|

Updated on: May 29, 2025 | 7:15 AM

Share

చైనా నక్క తోకను గట్టిగా తొక్కేసినట్లుంది. లేకపోతే.. 1000 టన్నుల బంగారు ఖనిజం లభించడం అంటే మాటలా? చైనాలో మరో భారీ బంగారు గని బయటపడటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. చైనా హునాన్ ప్రావిన్స్‌లోని పింగ్జియాంగ్‌ కౌంటీలో ఈ భారీ బంగారు గని ఉన్నట్టు హునాన్‌ ప్రావిన్స్‌ జియోలాజికల్‌ బ్యూరో ప్రకటించింది. ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద గోల్డ్​సరఫరాదారుగా ఉన్న చైనాకు మరో జాక్​పాట్ తగిలినట్లైంది. భూమి లోపల 2 కిలోమీటర్ల లోతులో దీన్ని గుర్తించారు. డ్రిల్​చేసిన అనేక రాళ్లను పరిశీలిస్తే బంగారం ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఒకే చోట 1000 టన్నులు ఉందని చెబుతున్నారు. పైగా.. ఈ బంగారం ప్యూర్ క్వాలిటీతో ఉంది అంటున్నారు. ఇందులో నిజం ఉండోచ్చు. ఎందుకంటే.. బంగారం మిగతా లోహాలతో కలవదు. విడిగానే ఉంటుంది. అది దాని ప్రత్యేక లక్షణం. అందువల్ల భూమిలో బంగారం దొరికితే, అది ప్యూర్ గానే ఉంటుంది. ఈ బంగారం విలువ రూ.7 లక్షల కోట్లుగా అంచనా వేశారు.

ఇప్పటివరకు అతిపెద్ద బంగారు గని రికార్డు సౌత్​ఆఫ్రికాలోని ‘సౌత్​ డీప్​ మైన్’​ పేరు మీద ఉంది. ఈ గనిలో 930 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. చైనాలో గుర్తించిన మైన్​ఈ రికార్డును బద్దలుగొట్టింది. ఓ అంచనా ప్రకారం.. 3 కిలోమీటర్ల పరిధిలో ఈ బంగారం ఉందట. ఏ దేశానికైనా బంగారం అతిపెద్ద శక్తిగా పరిగణిస్తారు. ఒక దేశం ఎంత బంగారం కలిగి ఉంటే అంత శక్తివంతంగా ఉంటుంది. ఇప్పటికే చైనా- ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం సరఫరాదారు. నిజంగా ఇక్కడ అంచనాలకు అనుగుణంగా బంగారం లభిస్తే.. ప్రపంచం గోల్డ్ మార్కెట్ డ్రాగన్ కంట్రీ శాసించడం ఖాయమని మార్కెట్ నిపుణుల అంచనా. ఈ బంగారు గని ఆ దేశ ఆర్థిక వృద్ధిని పెంచుతుందని అందరూ భావిస్తున్నారు. చైనాలో కనిపించిన ఈ బంగారాన్ని ఎప్పటి లోగా వెలికి తీస్తారో చెప్పలేదు. అయితే.. ఇది అంత ఈజీగా అయ్యే పని మాత్రం కాదు. 2 కిలోమీటర్ల లోతు నుంచి బంగారాన్ని పైకి తేవాలంటే.. సంవత్సరాలు పడుగుతోంది. పైగా భారీ ఖర్చు అవుతోంది.

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే