- Telugu News Photo Gallery Health benefits of eating dates everyday and uses in telugu lifestyle news
Dates : రోజుకి రెండు ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే వెంటనే మొదలు పెట్టేస్తారు
డ్రై ఫ్రూట్స్‌లో ఖర్జూరానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే.. ఈ ఖర్జూరాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.. ఖర్జూరాలు కమ్మటి రుచితో పాటు ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైనా శక్తి కోల్పోయినట్లు, నీరసంగా అనిపిస్తే ఒక్క ఖర్జూరం తిన్నా.. వెంటనే ఎనర్జీ వచ్చిన అనుభూతి కలుగుతుంది. ప్రతిరోజూ రెండు ఖర్జూరాలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: May 29, 2025 | 8:13 AM

ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవి ముఖ్యంగా ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం మరియు విటమిన్ B6 లలో సమృద్ధిగా ఉంటాయి. ఇందులో కొలెస్ట్రాల్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫినాలిక్ యాసిడ్ చాలా తక్కువ. కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, హృదయ నాళ వాపుని తగ్గిస్తుంది. ప్రతిరోజూ రెండు ఖర్జూరాలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

రోజూ ఖర్జూరం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలని సులభం చేస్తుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా మంచిది. కరిగే ఫైబర్ ఇందులో ఉండడం వల్ల కడుపులో మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది. ఆరోగ్యకరమైన గట్ సూక్ష్మజీవులని నిర్వహిస్తుంది.

రోజుకి రెండు ఖర్జూరాలను తినటం వల్ల అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరం తినటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు మీ కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అంజీరా, బాదం వంటి ఇతర పండ్లతో పోలిస్తే, ఖర్జూరంలో అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఉంటుంది.

రోజూ ఖర్జూరం తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. ఖర్జూరాలని రోజూ తీసుకుంటే ఐరన్ కంటెంట్ పెరిగి రక్తహీనతని దూరం చేస్తాయి. కానీ, ఇతర ఆహారాలతో పోలిస్తే, ఖర్జూరాలు తక్కువ గ్లైసెమిక్ సూచికని కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీన్ని తక్కువ పరిమాణంలోనే తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

మెదడు పనితీరును మెరుగుపరచడంలో రోజూ ఖర్జూరం తినడం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వైద్యులు అంటున్నారు. ప్రతిరోజూ రెండు ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించడమే కాకుండా, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.




