AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్త వేరియంట్‌తో మహిళ మృతి.. యాక్టివ్‌గా ఎన్ని ఉన్నాయంటే?

దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 2 వేలకు పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో కోవిడ్ యాక్టివ్‌ కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే డబుల్ అయింది.. భారతదేశంలో యాక్టివ్ COVID-19 కేసుల సంఖ్య 2,710కి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Covid-19: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్త వేరియంట్‌తో మహిళ మృతి.. యాక్టివ్‌గా ఎన్ని ఉన్నాయంటే?
Coronavirus
Shaik Madar Saheb
|

Updated on: May 31, 2025 | 12:39 PM

Share

దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 2 వేలకు పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో కోవిడ్ యాక్టివ్‌ కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే డబుల్ అయింది.. భారతదేశంలో యాక్టివ్ COVID-19 కేసుల సంఖ్య 2,710కి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రెండు రోజుల క్రితం.. మే 29 కరోనా యాక్టివ్ కేసులు.. 1010 మాత్రమే ఉన్నాయి.. ఈ క్రమంలోనే.. కేసులు అమాంతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మొత్తం 2710 కరోనావైరస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.. గత 24 గంటల్లో 511 కేసులు నమోదయ్యాయి. 255 మంది కోలుకోగా, ఏడుగురు మరణించారు. దేశంలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15 కి చేరుకుంది.. అందులో గరిష్టంగా 6 మరణాలు మహారాష్ట్రలో సంభవించాయి.

ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్ కారణంగా మొదటి మరణం నమోదైంది. JN.1 వేరియంట్ తో 60 ఏళ్ల మహిళ మరణించినట్లు అధికారులు తెలిపారు. . JN.1 వేరియంట్ ఉనికి యాదృచ్ఛికం అయినప్పటికీ, మహిళ ఉదర సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతోంది.

కేరళలో భారీగా కేసులు నమోదవుతున్నాయి.. ఒక్క కేరళ రాష్ట్రంలోనే.. 1,000 కంటే ఎక్కువ యాక్టివ్ COVID-19 కేసులు నమోదయ్యాయి. కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 1147 కు చేరుకుంది. గత వారం రోజుల్లో ఇక్కడ కరోనా కేసులు వేగంగా పెరిగాయి. ఓమిక్రాన్ JN వేరియంట్ LF7 కేసులు వస్తున్నాయని చెబుతున్నారు.

ఢిల్లీలో దాదాపు మూడు రెట్లు కేసులు పెరిగాయి.. ఢిల్లీలో ప్రస్తుతం 290 కేసులున్నాయి.. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా 100 మార్కును దాటాయి.. మహారాష్ట్రలో 424 కేసులు, గుజరాత్‌లో 223 కేసులు నమోదయ్యాయి.. తెలంగాణలో 3, ఏపీలో 16 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.

ఇలాంటి లక్షణాలుంటే అలర్ట్..

COVID-19 NB.1.8.1 – LF.7 లక్షణాలు తేలికపాటివి.. సూక్ష్మమైనవిగా వ్యక్తీకరించబడినప్పటికీ.. అవగాహన తప్పనిసరి అని పేర్కొంటున్నారు. 4 రోజులకు మించి ఉంటే చికిత్స పొందాలని అధికారులు సూచిస్తున్నారు. ముక్కు దిబ్బడ, జీర్ణశయాంతర సమస్యలు, వికారం, దీర్ఘకాలిక అలసట, తలనొప్పితో పాటు గొంతు నొప్పి, ఇతర ఇన్ఫ్లుఎంజా లాంటి లక్షణాలు జాగ్రత్త వహించాల్సిన లక్షణాలు.. ఇంట్లో ఐసోలేషన్ లో ఉంటే సరిపోతుందని.. భయపడాల్సిన అవసరం లేదని.. లక్షణాలు తేలికపాటివి, సూక్ష్మమైనవని అధికారులు తెలిపారు.. ఆసుపత్రులలో అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయని.. రాష్ట్రాలు వ్యాక్సిన్లు, RT-PCR పరీక్షలు, ఐసోలేషన్ అరీనాస్, ఆక్సిజన్ సిలిండర్లను నిల్వ చేస్తున్నాయని అధికారులు ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..