AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. పండ్ల బాక్స్‌లో ఉన్నది చూసి గుండె గుభేల్‌!

తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. పండ్ల బాక్స్‌లో ఉన్నది చూసి గుండె గుభేల్‌!

Phani CH
|

Updated on: Jun 29, 2026 | 9:32 PM

Share

మెట్‌పల్లి పాత బస్టాండ్‌లో పండ్ల వ్యాపారి తోపుడు బండిలో భారీ పాము దూరడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పండ్ల డబ్బా నుంచి బుస్సుమంటూ శబ్దం రావడంతో విషయం బయటపడింది. స్థానికులు దాదాపు 30 నిమిషాల పాటు శ్రమించి పామును సురక్షితంగా బయటకు తీసి అడవిలో వదిలారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.

ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉండే మెట్‌పల్లి పట్టణ పాత బస్టాండ్ ఏరియాలో ఒక్కసారిగా కలకలం రేగింది. పండ్లతో ఉన్న తోపుడు బండిలోకి భారీ పాము దూరిన ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అజీమ్ ఖాన్ అనే వ్యాపారి రోజులాగే ఉదయాన్నే పాత బస్టాండ్ సమీపంలో తన తోపుడు బండిపై పండ్ల దుకాణాన్ని తెరిచాడు. బండిపై ఉన్న పండ్ల డబ్బాలను సర్దుతుండగా, ఒక డబ్బా లోపలి నుంచి ఒక్కసారిగా ‘బుస్సు బుస్సు’ మంటూ శబ్దాలు వచ్చాయి. కంగారుపడిన అజీమ్.. చుట్టుపక్కల వారిని పిలిచి డబ్బాను పరిశీలించగా, అందులో ఒక పెద్ద పాము నక్కి ఉండటం చూసి అందరూ షాకయ్యారు. వ్యాపారితో పాటు అక్కడున్న జనం భయంతో పరుగులు తీశారు. పాత బస్టాండ్ ఏరియా ఎప్పుడూ భారీ ట్రాఫిక్‌తో ఉంటుంది. బహుశా ఆ వాహనాల రద్దీ, హారన్ల శబ్దాలకు భయపడే ఆ పాము తప్పించుకోవడానికి ఈ తోపుడు బండి డబ్బాలో దూరి ఉంటుందని స్థానికులు భావించారు. ఆ తర్వాత ఒకరిద్దరు ధైర్యవంతులు ముందుకు వచ్చి.. దాదాపు 30 నిమిషాల పాటు శ్రమించి, పాము తోక పట్టి చాకచక్యంగా బయటకు లాగి పట్టుకున్నారు. ఈ ఉత్కంఠ భరిత ఘటనలో పాము ఎవరికీ ఎలాంటి హాని చేయకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పామును సురక్షిత ప్రాంతంలో వదిలేయడంతో, వ్యాపారి అజీమ్ ఖాన్ యథావిధిగా తన పండ్ల వ్యాపారాన్ని కొనసాగించాడు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదేం దొంగతనం సామీ.. బంగారంతో పాటు ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..!

లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!

పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్‌.. కట్‌ చేస్తే..

ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట.. భయంతో పరుగులు తీసిన ఇంటి యజమాని

కేజీఎఫ్ కాదు బాస్.. అంతకు మించి.. మేడిన్ ఆంధ్ర గోల్డ్ వచ్చేసింది!

Follow Us