AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!

లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!

Phani CH
|

Updated on: Jun 29, 2026 | 6:42 PM

Share

మధ్యప్రదేశ్‌లో 8 ఫారెస్ట్ గార్డ్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఫిజికల్ టెస్ట్‌కు ఎంపికైన 26 మందిలో అంజనా బైగా ఒక్కరే హాజరైంది. ఆమె 15 కిలోమీటర్ల నడక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకుంది. మిగిలిన 7 పోస్టులు ఖాళీగా ఉండగా, ఇతర అభ్యర్థులు ఎందుకు గైర్హాజరయ్యారనే విషయంపై అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.

ఒక్క ప్రభుత్వ ఉద్యోగం నోటిఫికేషన్ పడితే చాలు.. వందలు, వేలు, లక్షల మంది పోటీ పడటం ఈ రోజుల్లో సర్వసాధారణం. కానీ, మధ్యప్రదేశ్‌లో మాత్రం సీన్‌ రివర్స్‌లో ఉంది. ఇక్కడ 8 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తే.. అక్కడికి వచ్చింది కేవలం ఒకే ఒక్క అభ్యర్థి! దీంతో ఆమె సునాయాసంగా పరీక్ష పాసై, బ్రహ్మాండమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని చేజిక్కించుకుంది. అసలేం జరిగిందంటే…మధ్యప్రదేశ్ అటవీ శాఖ వెనుకబడిన గిరిజన తెగలకు చెందిన అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా 8 ఫారెస్ట్ గార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం సుమారు 1,205 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు, అర్హతల ఆధారంగా 26 మంది అభ్యర్థులను తుది ఫిజికల్ టెస్ట్‌కు ఎంపిక చేసి పిలిచారు. తీరా ఫిజికల్ టెస్ట్ రోజున గ్రౌండ్‌కు వెళ్లి చూస్తే అధికారులకు దిమ్మతిరిగిపోయింది. ఎంపికైన 26 మందిలో ‘అంజనా బైగా’ అనే ఏకైక యువతి మాత్రమే అక్కడికి హాజరైంది. మిగిలిన 25 మంది అభ్యర్థులు అసలు రాలేదు. దీంతో పరీక్షలో భాగంగా నిర్దేశించిన 15 కిలోమీటర్ల నడక పరీక్షను అంజనా బైగా విజయవంతంగా పూర్తి చేసి, ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాన్ని సొంతం చేసుకుంది. ఒక్కరే రావడంతో మిగిలిన 7 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. అయితే, ఇంత మంచి అవకాశం వచ్చినా మిగిలిన 25 మంది అభ్యర్థులు ఎందుకు రాలేదు? ఫిజికల్ టెస్ట్ అంటే భయపడ్డారా? లేక సమాచారం అందలేదా? అనే కోణంలో అటవీ శాఖ అధికారులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా, పోటీ లేకుండానే ఉద్యోగం సాధించిన అంజనా బైగా అదృష్టాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్‌.. కట్‌ చేస్తే..

ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట.. భయంతో పరుగులు తీసిన ఇంటి యజమాని

కేజీఎఫ్ కాదు బాస్.. అంతకు మించి.. మేడిన్ ఆంధ్ర గోల్డ్ వచ్చేసింది!

వందే భారత్ ఏసీ కోచ్‌ చూసారా? లగ్జరీ ఇంటీరియర్స్‌తో లుక్‌ అదిరిందిగా!

Follow Us