వందే భారత్ ఏసీ కోచ్ చూసారా? లగ్జరీ ఇంటీరియర్స్‌తో లుక్ అదిరిందిగా!
ముంబై–బెంగళూరు మార్గంలో త్వరలో ప్రారంభం కానున్న వందే భారత్ స్లీపర్ రైలు ఫస్ట్ ఏసీ కోచ్ లగ్జరీ ఇంటీరియర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రైవేట్ క్యాబిన్లు, ఆధునిక వాష్‌రూమ్‌లు, సీసీటీవీ, డిజిటల్ డిస్‌ప్లేలు, సెంట్రలైజ్డ్ ఏసీ వంటి అత్యాధునిక సౌకర్యాలతో ఈ రైలు ఫైవ్ స్టార్ హోటల్ అనుభూతిని అందించనుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.
ప్రయాణికులకు ఫైవ్ స్టార్ హోటల్ అనుభూతిని అందిస్తూ ముంబై– బెంగళూరు రూట్‌లో వందే భారత్ స్లీపర్ అందుబాటులోకి రానుంది. ఈ రైల్లోని ఫస్ట్ ఏసీ కోచ్ ఇంటీరియర్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీని అద్భుత డిజైన్, ప్రీమియం లుక్‌ను చూసిన నెటిజన్లు ఇది రైలు పెట్టె కాదు లగ్జరీ హోటల్ రూమ్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ ఏసీ కోచ్‌ను విలాసవంతమైన ప్రైవేటు క్యాబిన్లుగా తీర్చిదిద్దింది భారత రైల్వే. కోచ్ లోపలి భాగాన్ని రిచ్ లుక్‌తో డిజైన్ చేశారు. ఆధునిక డిజైన్, పరిశుభ్రతా ప్రమాణాలతో నెక్స్ట్ జనరేషన్ టాయిలెట్లను ఏర్పాటు చేసారు. భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రయాణికుల రక్షణ కోసం కోచ్‌లో నిరంతర నిఘా కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రైలు వేగం, తర్వాతి స్టేషన్ వివరాలను తెలియచేసే డిజిటల్ స్క్రీన్స్ అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు పగటిపూట ప్రయాణాల కోసం చైర్ కార్ సౌకర్యంతో మాత్రమే నడుస్తున్నాయి. అయితే, సుదూర ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఈ స్లీపర్ వెర్షన్‌ను రూపొందించారు. సాధారణ ఫస్ట్ ఏసీ కోచ్‌లతో పోలిస్తే ఈ కొత్త వందే భారత్ స్లీపర్ క్లాస్ చాలా డిఫరెంట్‌గా, మోడ్రన్‌గా ఉంది. ఆధునిక లైటింగ్ సిస్టమ్, ప్రీమియం ఫినిషింగ్‌తో గోడలు, స్పేస్ చాలా చక్కగా ఉపయోగపడేలా చేసిన లేఅవుట్ ప్రయాణికులకు ఒక సరికొత్త ఫీలింగ్‌ను ఇస్తాయి. 12 నుండి 16 గంటల సుదీర్ఘ ప్రయాణంలో అలసట తెలియకుండా ఉండేందుకు వీలుగా బెర్త్‌లను ఎంతో సౌకర్యవంతంగా తయారు చేశారు. ఈ రైలులో ముఖ్యమైన ఫీచర్లు ఏంటంటే.. అప్‌గ్రేడ్ చేసిన అత్యాధునిక వాష్‌రూమ్‌లు, డిజిటల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే బోర్డులు, ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ (CCTV) కెమెరాలు. కోచ్ అంతటా సెంట్రలైజ్డ్ ఏసీ , ఆహ్లాదకరమైన లైటింగ్. వీడియో చూసిన నెటిజన్లు.. “ఇది రైలు పెట్టె కాదు బాబోయ్, పట్టాలపై నడిచే ఒక లగ్జరీ బొటిక్ హోటల్ రూమ్” అంటూ కామెంట్లు పెడుతున్నారు. అత్యంత బిజీగా ఉండే కారిడార్లలో బెంగళూరు – ముంబయి రూట్ ఒకటి. వ్యాపారవేత్తలు, ఐటీ ఉద్యోగులు, స్టూడెంట్స్ ఈ రూట్‌లో నిరంతరం ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం చాలా మంది సమయం ఆదా అవుతుందని ఫ్లైట్ జర్నీ చేస్తున్నారు. కానీ ఎయిర్‌పోర్టుకు వెళ్లడం, లగేజీ పరిమితులు, సెక్యూరిటీ చెకింగ్ వంటి తలనొప్పులు లేకుండా.. తక్కువ ఖర్చుతో ప్రశాంతంగా పడుకుని ప్రయాణించాలనుకునే వారికి ఈ వందే భారత్ స్లీపర్ బెస్ట్ ఆప్షన్‌గా మారబోతోంది. ఏదేమైనా ఈ సరికొత్త స్లీపర్ ట్రైన్ భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చేయడం ఖాయమనే చెప్పచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జూలై 1 నుంచి కొత్త రూల్స్!
పోలీస్ స్టేషన్‌లో లేడీ కానిస్టేబుల్ నిర్వాకం.. దిమ్మతిరిగే షాకిచ్చిన నెటిజన్లు
రెచ్చిపోయిన ఉప్పల్ బాలు.. ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రమాదకర స్టంట్స్!
ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా భారతీయులు కాదా? పౌరసత్వానికి అసలైన రుజువు ఏంటి?
రోడ్డుపై స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి.. అంతలోనే..
పోలీస్ స్టేషన్‌లో లేడీ కానిస్టేబుల్ నిర్వాకం..
రెచ్చిపోయిన ఉప్పల్ బాలు.. ఆధ్యాత్మిక క్షేత్రంలో స్టంట్స్
జీతం రూ.లక్ష.. సేవింగ్స్ సున్నా.. ముంచుతున్నవి ఈ అలవాట్లే!
సీటుకోసం సమరం.. పాలిటిక్స్‌లో కాదు.. ఆర్టీసీ బస్సులో..
టిఫిన్ సెంటర్లో వడలు లాగించేస్తున్నారా.. ఈ వీడియో చూడండి
మురుగు కాల్వలో బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఇదో వెరైటీ నిరసన!

