రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జూలై 1 నుంచి కొత్త రూల్స్!
రైలు ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువస్తోంది. జూలై 1 నుంచి రైళ్లు, రైల్వే స్టేషన్లలో ధూమపానం చేస్తే భారీ జరిమానాతో పాటు టికెట్ రద్దు, జైలు శిక్ష కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే రిజర్వేషన్ లేని ప్రయాణికులు ఇతరుల బెర్తులు ఆక్రమించినా కఠిన చర్యలు తీసుకోనున్నారు.
రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. రైళ్లలో ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణను మెరుగుపరిచేందుకు కేంద్రం ‘జన్ విశ్వాస్ చట్టం’ కింద నిబంధనలను మరింత కఠినతరం చేసింది. దీనికి సంబంధించిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగా, జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. రైళ్లలో గానీ, రైల్వే స్టేషన్ ప్రాంగణంలో గానీ ధూమపానం చేస్తూ పట్టుబడితే భారీ జరిమానా విధిస్తారు. అంతేకాదు, తప్పు తీవ్రతను బట్టి సదరు ప్రయాణికుడి టికెట్‌ను తక్షణమే రద్దు చేయడంతో పాటు, జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఇలాంటి చర్యలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని అధికారులు తేల్చిచెప్పారు. ఈ చట్టం ద్వారా కేవలం ధూమపానమే కాకుండా, రైళ్లలో జరిగే మరో పెద్ద సమస్యకు చెక్ పడనుంది. రిజర్వేషన్ లేని ప్రయాణికులు ఇతరుల బెర్తులను ఆక్రమించుకోవడం, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం వంటి పనులకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కొత్త నిబంధనలు మార్గం సుగమం చేశాయి. జూలై 1 నుంచి ఈ రూల్స్ ను పకడ్బందీగా అమలు చేయనున్నందున, ప్రయాణికులు వీటిని పాటించి ప్రయాణాన్ని సురక్షితంగా చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోలీస్ స్టేషన్‌లో లేడీ కానిస్టేబుల్ నిర్వాకం.. దిమ్మతిరిగే షాకిచ్చిన నెటిజన్లు
రెచ్చిపోయిన ఉప్పల్ బాలు.. ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రమాదకర స్టంట్స్!
ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా భారతీయులు కాదా? పౌరసత్వానికి అసలైన రుజువు ఏంటి?
పోలీస్ స్టేషన్‌లో లేడీ కానిస్టేబుల్ నిర్వాకం..
రెచ్చిపోయిన ఉప్పల్ బాలు.. ఆధ్యాత్మిక క్షేత్రంలో స్టంట్స్
జీతం రూ.లక్ష.. సేవింగ్స్ సున్నా.. ముంచుతున్నవి ఈ అలవాట్లే!
సీటుకోసం సమరం.. పాలిటిక్స్‌లో కాదు.. ఆర్టీసీ బస్సులో..
టిఫిన్ సెంటర్లో వడలు లాగించేస్తున్నారా.. ఈ వీడియో చూడండి
మురుగు కాల్వలో బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఇదో వెరైటీ నిరసన!
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు

