ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట.. భయంతో పరుగులు తీసిన ఇంటి యజమాని
నంద్యాల పట్టణంలోని మూలసాగరం ప్రాంతంలో ఓ ఇంటి సమీపంలో రెండు భారీ నాగుపాములు ఒకదానికొకటి పెనవేసుకుని కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ రజాక్ తన బృందంతో వాటిని సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. వర్షాకాలంలో పాములు కనిపిస్తే చంపకుండా అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
నంద్యాల పట్టణంలోని మూలసాగరం ప్రాంతంలో శనివారం ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన ఒకటి వెలుగుచూసింది. ఒక ఇంటి సమీపంలో రెండు భారీ నాగుపాములు ప్రత్యక్షమయ్యాయి. ఆ పాములు ఒకదానినొకటి పెవేసుకొని సయ్యాటలో మునిగిపోయాయి. అలవాటుగా పెరట్లోకి వచ్చిన ఇంటి యజమాని అక్కడి దృశ్యం చూసి భయంతో పరుగులు తీశాడు. విషయం తెలిసిన స్థానికులు కూడా అక్కడికి చేరుకొని పడగ విప్పి ఒకదానికొకటి పెనవేసుకుంటూ సాగిన నాగుపాముల సయ్యాటను చూసి కాలనీ వాసులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ రజాక్ తన బృందంతో ఘటనాస్థలికి చేరుకున్నాడు. ఎంతో అప్రమత్తంగా, అతి కష్టంపై రెండు నాగుపాములను సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం వాటిని జనావాసాలకు దూరంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. రెండు నాగుపాములు అడవిలో వదిలేయడంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలంలో పాములు ఎక్కువగా బయటకు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాములు కనిపిస్తే వాటిని చంపేందుకు ప్రయత్నించకుండా వెంటనే స్నేక్ క్యాచర్లకు లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని రజాక్ సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కేజీఎఫ్ కాదు బాస్.. అంతకు మించి.. మేడిన్ ఆంధ్ర గోల్డ్ వచ్చేసింది!
వందే భారత్ ఏసీ కోచ్ చూసారా? లగ్జరీ ఇంటీరియర్స్‌తో లుక్ అదిరిందిగా!
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..

