AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోల్డ్ మార్కెట్ కొలాప్స్.! ఆకాశం నుండి పాతాళానికి..రేపటి రేట్లు వింటే మైండ్ బ్లాక్!

గోల్డ్ మార్కెట్ కొలాప్స్.! ఆకాశం నుండి పాతాళానికి..రేపటి రేట్లు వింటే మైండ్ బ్లాక్!

Phani CH
|

Updated on: Jun 29, 2026 | 9:43 PM

Share

గత 15 నెలలుగా రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు భారీగా క్షీణిస్తున్నాయి. ఈ త్రైమాసికంలోనే బంగారం సుమారు 12 శాతం, వెండి 17.6 శాతం పడిపోయాయి. అమెరికా డాలర్ బలపడటం, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు, లాభాల స్వీకరణ, పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గడం వంటి అంశాలు ఈ పతనానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.

భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం కాదు.. అదొక సెంటిమెంట్. అలాంటిది, గత కొద్ది నెలలుగా బంగారం, వెండి దుకాణాల వైపు వెళ్లాలంటేనే సామాన్యుడి గుండె గుభేల్ మంది. ‘ఆకాశమే హద్దు’ అన్నట్టుగా రోజురోజుకూ రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోయిన పసిడి, వెండి ధరలు.. ఇప్పుడు అంతే వేగంతో, అదే రేంజ్‌లో కిందికి దిగి వస్తున్నాయి. నిన్నటివరకు రేట్లు పెరుగుతాయేమో అని భయపడి ఎగబడి కొన్నవాళ్లకు, అలాగే ధరలు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్న వాళ్లకు.. మార్కెట్ ఒక ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో, అంటే కేవలం ఈ మూడు నెలల వ్యవధిలోనే.. గడిచిన దశాబ్దంలోనే ఎన్నడూ లేనంతగా గోల్డ్ వాల్యూ దారుణంగా క్షీణించింది. ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు 12 శాతం రేట్లు పడిపోయాయి. ఒకే త్రైమాసికంలో ఇంతటి పతనం చూడటం 2016 డిసెంబర్ తర్వాత ఇదే మొదటిసారి. ఇక వెండి పరిస్థితి అయితే మరింత ఘోరంగా ఉంది. సిల్వర్ వాల్యూ కేవలం కొద్ది రోజుల్లోనే నాలుగేళ్లలో ఎన్నడూ లేనంత భారీ పతనాన్ని చవిచూసింది. ఏకంగా 17.6 శాతం మేర వెండి ధరలు కుప్పకూలాయి. 2022 జూన్ తర్వాత వెండిలో ఇంత పెద్ద క్షీణతను మార్కెట్ వర్గాలు ఎప్పుడూ ఊహించలేదు. వరుసగా 15 నెలల పాటు నాన్‌స్టాప్‌గా పరుగులు పెట్టిన పుత్తడి, వెండి ధరలు.. ఒక్కసారిగా ఇలా రివర్స్ గేర్‌లోకి వెళ్లడంతో అటు వ్యాపారుల్లోనూ, ఇటు పెట్టుబడిదారుల్లోనూ ఒక రకమైన స్తబ్ధత నెలకొంది. కొనుగోలుదారులు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక, ‘ఇంకా తగ్గుతుందేమో’ అనే వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నారు.అసలు ఆకాశంలో ఉన్న ధరలు పాతాళానికి ఎందుకు వస్తున్నాయి? అంతర్జాతీయంగా జరిగిన ఆ పెద్ద మార్పులు ఏంటి? అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరిగిన డీల్స్ ఈ మార్కెట్‌ను ఎలా దెబ్బతీశాయి? దేశీయంగా హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లలో రేట్లు ఎలా ఉన్నాయి? అనేది చూద్దాం. అసలు ఈ పతనం ఎంత తీవ్రంగా ఉందో అర్థం కావాలంటే, మనం ఒకసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి. గత ఏడాది, అంటే 2024, 2025 లలో బంగారం, వెండి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఒకసారి రికార్డులు గమనిస్తే.. 2024 లో పసిడి విలువ 28 శాతం పుంజుకుంది. ఇక 2025 లో అయితే ఏకంగా 65 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. వెండి ధరల సంగతి చెప్పక్కర్లేదు.. 2024లో 22 శాతం పెరిగితే, 2025లో ఏకంగా 148 శాతం వృద్ధితో సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం ఏడాది కాలంలో ఈ ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ ఏడాది ప్రారంభంలో, అంటే జనవరి-మార్చి త్రైమాసికంలో కూడా బంగారం ధర మరో 10 శాతం పెరిగింది. ఇక జనవరి-ఫిబ్రవరి నెలల్లోనే వెండి రేటు ఏకంగా 28 శాతం ఎగబాకింది. ఆ ఉధృతి ఏ స్థాయికి చేరిందంటే.. సరిగ్గా ఈ ఏడాది జనవరి 29న గోల్డ్, సిల్వర్ రేట్లు తమ ఆల్‌టైమ్ హై రికార్డును నమోదు చేశాయి. ఆ రోజు తులం బంగారం ధర అక్షరాలా రూ. 1,83,000 పలికింది! అలాగే కిలో వెండి ధర ఊహకందని విధంగా రూ. 4,04,500 మార్కును తాకింది! అప్పట్లో ఈ రేట్లు చూసి సామాన్యులు ఇక జీవితంలో బంగారం కొనలేమేమో అని డిసైడ్ అయిపోయారు. కానీ, సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. గడిచిన మూడు రోజుల్లోనే దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల తులం పుత్తడి రేటు ఏకంగా రూ. 7,000 పడిపోయింది! అలాగే కిలో వెండి విలువ ఏకంగా రూ. 19,500 క్షీణించింది. ప్రస్తుత మార్కెట్ ధరలను ఒకసారి పరిశీలిస్తే.. ఢిల్లీలో పసిడి ధర రూ. 2,800 దిగివచ్చి రూ. 1,45,300 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి రేటు కిలోకు రూ. 5,000 పడిపోయి రూ. 2,26,000 గా నమోదైంది. మన హైదరాబాద్‌లో విషయానికి వస్తే.. 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ధర రూ. 1,450 తగ్గి రూ. 1,29,550 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది. అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ ధర 21.15 డాలర్లు క్షీణించి 3,978.06 డాలర్లుగా ఉంటే, సిల్వర్ 57.10 డాలర్లుగా ట్రేడ్ అవుతోంది. చూశారుగా.. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే మార్కెట్ ఎంతలా తలకిందులైందో! మరి అసలు ఈ పతనానికి గల అంతర్జాతీయ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎందుకు ఇలా జరుగుతోంది? అంతలా పరుగులు పెట్టిన బంగారం ఒక్కసారిగా ఎందుకు కుప్పకూలుతోంది? దీనిపై మెజారిటీ మార్కెట్ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు కొన్ని బలమైన కారణాలను చెబుతున్నారు. ఒకటి.. అమెరికా డాలర్, బాండ్ ఈల్డ్స్ బలపడటం. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి, అమెరికా డాలర్‌కు ఎప్పుడూ రివర్స్ లింక్ ఉంటుంది. డాలర్ బలహీనపడితే బంగారం పెరుగుతుంది.. డాలర్ బలపడితే బంగారం తగ్గుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ ఇండెక్స్ విపరీతంగా బలపడింది. దీనితో పాటు యూఎస్ బాండ్లపై వచ్చే ఆదాయం కూడా పెరిగాయి. ఇన్వెస్టర్లకు బాండ్ల ద్వారా సురక్షితమైన, ఎక్కువ లాభాలు వస్తుండటంతో.. వాళ్లంతా బంగారంలో ఉన్న పెట్టుబడులను తీసి డాలర్ బాండ్లలో పెట్టడం మొదలుపెట్టారు. దీనివల్ల బంగారంపై అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు తగ్గుతున్నాయి. రెండో కారణం చెప్పాలంటే.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ‘ఫెడరల్ రిజర్వ్’ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే అంచనాలు మార్కెట్లో బలంగా వినిపిస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే బ్యాంకులు, బాండ్లలో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు ఎక్కువ వడ్డీ వస్తుంది. కానీ బంగారంపై ఎలాంటి వడ్డీ రాదు, కేవలం ధర పెరిగితేనే లాభం. అందుకే వడ్డీ రేట్లు పెరుగుతాయనే భయంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని వదిలించుకుంటున్నారు. మూడో కారణం.. ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్. ఇన్నాళ్లూ అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితి కారణం కావచ్చు, ద్రవ్యోల్బణం కారణం కావచ్చు.. మదుపర్లు తమ పెట్టుబడులకు రక్షణ కవచంగా గోల్డ్, సిల్వర్‌ను భావించారు. అందుకే ఎడాపెడా కొనేశారు. ఎప్పుడైతే బంగారం ధర రూ. 1.83 లక్షలకు, వెండి రూ. 4 లక్షలకు చేరిందో.. వాళ్లకు భారీగా లాభాలు వచ్చాయి. ఇప్పుడు ధరలు గరిష్ట స్థాయికి చేరడంతో, ఆ లాభాలను చేజిక్కించుకోవడానికి ఇన్వెస్టర్లు విపరీతంగా అమ్మకాలకు దిగుతున్నారు. ఈ భారీ అమ్మకాల వల్ల మార్కెట్లో డిమాండ్ తగ్గి, సప్లై ఎక్కువై ధరలు పడిపోతున్నాయి. నాలుగో కారణం.. టెక్నాలజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి. గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో, ముఖ్యంగా అమెరికా మరియు ఇతర పెద్ద దేశాల స్టాక్ మార్కెట్లలో టెక్నాలజీ షేర్లపై భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. స్టాక్ మార్కెట్లలో నగదు కొరత ఏర్పడినప్పుడు లేదా పెద్ద పెద్ద ఫండ్స్ నష్టాల్లో ఉన్నప్పుడు.. ఆ నష్టాలను పూడ్చుకోవడానికి ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్ముతుంటారు. ఈ టెక్ షేర్ల క్రాష్ కూడా పరోక్షంగా గోల్డ్, సిల్వర్ రేట్లను దిగజార్చడానికి ఒక కారణమైంది. ఇక ఐదో కారణం.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం భయాలు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు సాధారణంగా బంగారానికి డిమాండ్ ఉంటుంది. కానీ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు కఠినమైన నిర్ణయాలు, వడ్డీ రేట్ల పెంపు వంటి చర్యలు తీసుకుంటుండటంతో మార్కెట్ డౌన్ ట్రెండ్‌కు దారితీసింది. అయితే నిపుణులు చెబుతున్న వీటన్నిటికంటే అతి ముఖ్యమైన, మార్కెట్‌ను ఒక్కసారిగా కుదిపేసిన ఒక పొలిటికల్ ట్విస్ట్ ఉంది. అదే.. పశ్చిమాసియా సంక్షోభం మరియు ముడి చమురు ధరల కథ. కొన్ని నెలలుగా అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలలో ఉద్రిక్తతలు పెరిగాయి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తికి పెద్ద బ్రేకులు పడ్డాయి. ఎప్పుడైతే సప్లై తగ్గిందో, డిమాండ్ పెరిగి క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ముడి చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ముంచుకొస్తుంది. ఈ ద్రవ్యోల్బణం భయాల నుండి తమ డబ్బును కాపాడుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద ఇన్వెస్టర్లు, సామాన్యులు అందరూ కూడా బంగారం, వెండి కొనుగోలు కోసం ఎగబడ్డారు. అందుకే జనవరిలో ధరలు అంతలా పెరిగాయి. కానీ, ఇక్కడే సీన్ రివర్స్ అయింది! తెరవెనుక జరిగిన అమెరికా-ఇరాన్ డీల్.. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులను కొంతమేర అదుపులోకి తెచ్చింది. యుద్ధ భయాలు తగ్గి, ఉద్రిక్తతలు శాంతించాయి. దీనితో పాటు గల్ఫ్ నుండి క్రూడాయిల్ సరఫరా మళ్లీ పుంజుకుంది. దీని ఫలితంగా ముడి చమురు రేట్లు ఒక్కసారిగా దిగువముఖం పట్టాయి. ఎప్పుడైతే ఇంధన ధరలు తగ్గి, ద్రవ్యోల్బణం భయాలు తొలగిపోయాయో.. ఇన్వెస్టర్లలో ఉన్న భయం పోయింది. దాంతో, భయంతో బంగారం కొన్నవాళ్లంతా ఒక్కసారిగా వాటిని మార్కెట్లో అమ్మేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గల్ఫ్ వార్ గనుక పూర్తిగా ముగింపు కార్డు పడితే.. మార్కెట్లో ఇంకా పెద్ద ‘కరెక్షన్’ అంటే ధరల తగ్గుదల ఉంటుందని, బంగారం ధరలు మరికొంత కాలం పాటు తగ్గుతూనే ఉంటాయని అంతర్జాతీయ మార్కెట్ వర్గాలు బలంగా అంచనా వేస్తున్నాయి. వరుసగా 15 నెలల పాటు పెరిగిన రేట్లు, ఇప్పుడు అంతే వేగంగా కిందికి వస్తుండటంతో సామాన్యుడికి ఇది ఒక రకంగా ఊరట కలిగించే విషయమే అయినా.. మార్కెట్లో ప్రస్తుతం ఒక విధమైన స్తబ్ధత ఉంది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. మార్కెట్ ఇంకా పూర్తి స్థిరత్వానికి రాలేదు. గల్ఫ్ దేశాల పరిస్థితులు, అమెరికా ఫెడ్ నిర్ణయాలపై ఆధారపడి ధరలు ఇంకాస్త తగ్గే అవకాశం ఉంది. అందుకే కొనుగోలుదారులు ప్రస్తుతం ‘వేచిచూసే ధోరణి’ని అవలంబిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. కానీ నేనే ధనవంతురాలిని అయ్యా.. న్యూట్రిషనిస్ట్ కథ వైరల్

1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్‌కమ్!

తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. పండ్ల బాక్స్‌లో ఉన్నది చూసి గుండె గుభేల్‌!

ఇదేం దొంగతనం సామీ.. బంగారంతో పాటు ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..!

లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!

Published on: Jun 29, 2026 09:43 PM
Follow Us