ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాలో ఒక ప్రత్యేక గీతం ఉంటుందని తెలుస్తోంది. హాలీవుడ్ స్టైల్లో రూపొందిస్తున్న ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. త్రిప్తి డిమ్రితో పాటు మరో బాలీవుడ్ నటి ప్రభాస్‌తో కలిసి స్టెప్పులేయనున్నారు. ఈ పాట కోసం హర్షవర్ధన్ రామేశ్వర్ అద్భుతమైన ట్యూన్‌ని కంపోజ్ చేశారు.