హోంమంత్రి అనిత మంచి మనసు.. మహిళా ఎస్సైకి ఘనంగా సీమంతం
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత, నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న గర్భిణి మహిళా ఎస్సై సాహిబా అంజుమ్‌కు తన నివాసంలో సంప్రదాయబద్ధంగా సీమంతం నిర్వహించారు. గాజులు తొడిగి, ఆశీర్వదించిన మంత్రి తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మంత్రి చూపిన ఆప్యాయతకు ఎస్సై సాహిబా అంజుమ్ భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత మరోసారి తన ఉదారతను, గొప్ప మనసును చాటుకున్నారు. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ఆమె.. తన శాఖలో విధి నిర్వహణలో ఉన్న ఒక గర్భిణి అయిన మహిళా ఎస్సైకి స్వయంగా సీమంతం వేడుక నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో సాహిబా అంజుమ్ అనే మహిళ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె గర్భిణి కావడంతో.. నక్కపల్లిలోని మంత్రి నివాసంలోనే ఈ సీమంతం వేడుకను అత్యంత ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత.. మహిళా ఎస్సై సాహిబా అంజుమ్ ఆరోగ్య పరిస్థితిని, యోగక్షేమాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంప్రదాయబద్ధంగా గాజులు తొడిగి, పూలు పెట్టి, దీవెనలు అందించి సీమంతం చేశారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని హోం మంత్రి ఆకాంక్షించారు. ఒక రాష్ట్ర హోం మంత్రి అయి ఉండి, ప్రోటోకాల్ పక్కనబెట్టి తనపై చూపిన ఈ మాతృప్రేమకు ఎస్సై సాహిబా అంజుమ్ భావోద్వేగానికి గురవుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని ఎస్సైకి శుభాకాంక్షలు అందజేశారు. గతంలోనూ మంత్రి అనిత ఒక మహిళా కానిస్టేబుల్‌కు ఇలాగే సీమంతం చేయడం గమనార్హం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పడిపోతున్న పసిడి ధరలు.. భయంతో జనం ఏం చేస్తున్నారో చూడండి!
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్! మరో 2 రోజులు దంచికొట్టనున్న వానలు!
గోల్డ్ మార్కెట్ కొలాప్స్.! ఆకాశం నుండి పాతాళానికి..రేపటి రేట్లు వింటే మైండ్ బ్లాక్!
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. కానీ నేనే ధనవంతురాలిని అయ్యా.. న్యూట్రిషనిస్ట్ కథ వైరల్
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్‌కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

