Covid-19 in India: అమ్మబాబోయ్.. గత 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మృతి.. యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..
చాప కింద నీరులా, దేశంలో కరోనా వ్యాపిస్తోంది. ఇక ఏపీ, తెలంగాణలో కూడా కొవిడ్ యాక్టివ్ కేసులు మెల్లగా పెరుగుతున్నాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరిగింది.

కరోనా వైరస్ దేశంలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే.. కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని.. అయితే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గత 24 గంటల్లో కోవిడ్-19 కేసులు భారీగా పెరిగాయి.. గడిచిన 24 గంటల్లో 276 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు కాగా.. ఏడుగురు మృతి చెందారు.. యాక్టివ్ కేసుల సంఖ్య 4,302 కు పెరిగింది..
ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం తాజా గణాంకాలను విడుదల చేసింది. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరిగింది. అయితే, 3281 మంది రోగులు కూడా కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో నలుగురు, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌లో ఒక్కో మరణం నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 44 మంది కోవిడ్‌తో మృతి చెందారు.
COVID Cases Continue To Rise In India 📌Total Active Cases- 4302
Source: Ministry of Health and Family Welfare, COVID Dashboard As on June 4, 2025#COVID19 #COVID_19 #Corona #COVIDIndia #India #Kerala #Delhi #WestBengal #Maharashtra #Gujarat pic.twitter.com/KusdfvDhW8
— First Check (@FirstCheck_In) June 4, 2025
కేరళలో అత్యధికంగా 1373 యాక్టివ్ కేసులు, మహారాష్ట్రలో 510, ఢిల్లీలో 457, గుజరాత్ 461, పశ్చిమ బెంగాల్ 432, కర్ణాటక 324 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఏపీలో 31, తెలంగాణలో 3 యాక్టీవ్ కేసులున్నాయి.. ఏపీలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ మైల్డ్ వేరియంట్ అని, ప్రజల్లో హార్డ్ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




