Watch: బుడ్డోడా మజాకా.. బిర్యానీ కావాలంటూ ఏకంగా సర్కార్‌కే సవాల్..! కట్ చేస్తే..
అంగన్వాడీలో పెడుతున్న ఉప్మా వద్దు మాకు బిర్యానీ కావాలంటూ ఓ బుడ్డొడు చెప్పిన మాటల వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ బుడతడి కోరిక ప్రకారం అంగన్వాడీ మెనూనే మార్చేశారు అక్కడి ప్రభుత్వ పెద్దలు. మంగళవారం అంగన్‌వాడీల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. అంగన్‌వాడీల్లో పిల్లలకు అందించే ఆహారం మెనూ మారుస్తూ.. కొత్త మెనూను ప్రవేశపెట్టారు. అది ఎలా ఉందంటే..

ఉప్మాకు బదులు బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలి అంటూ.. బుజ్జిబుజ్జి మాటలతో ఓ చిన్నారి కోరిన కోరిక మేరకు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే కదిలివచ్చింది. అంగన్వాడీలో పెడుతున్న ఉప్మా వద్దు మాకు బిర్యానీ కావాలంటూ ఓ బుడ్డొడు చెప్పిన మాటల వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ బుడతడి కోరిక ప్రకారం కేరళలోని అంగన్వాడీ మెనూనే మార్చేశారు అక్కడి ప్రభుత్వ పెద్దలు. మంగళవారం అంగన్‌వాడీల పునఃప్రారంభ కార్యక్రమంలో కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పాల్గొన్నారు. అంగన్‌వాడీల్లో పిల్లలకు అందించే ఆహారం మెనూ మారుస్తూ.. కొత్త మెనూను ప్రవేశపెట్టారు. అది ఎలా ఉందంటే..
కేరళకు చెందిన శంకు అనే బుడ్డొడి కోరిక మేరకు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు బిర్యానీ అందుబాటులోకి వచ్చింది. ఉప్మా బదులుగా బిర్యానీ తినాలని ఉందని 3 నెలల క్రితం అలప్పుజకు చెందిన చిన్నారి శంకు పోస్ట్ చేసిన వీడియో అక్కడి ప్రభుత్వాన్ని కదిలించింది. ఆ వీడియోను చూసిన కేరళ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ అంగన్‌వాడీ సెంటర్ పిల్లలకిచ్చే ఆహార మెనూనే మార్చేశారు. కొత్తగా రూపొందించిన మెనూలో బిర్యానీతోపాటు ఎగ్ బిర్యానీ, పులావ్, పప్పు, పాయసం, సోయా డ్రై కర్రీ, లడ్డూలను చేర్చారు. గతంలో వారానికి 2సార్లు అందించే పాలు, గుడ్లు ఇప్పుడు వారానికి 3 సార్లు అందిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఇకపోతే, వారం రోజుల పాటు అంగన్‌వాడీలలో సవరించిన ఆహారాల మెనూ ఇలా ఉంది..
సోమవారం:
అల్పాహారం: పాలు, గంజి, కొబ్బరి పాలు/ఆకుకూరలు
భోజనం: అన్నం, పెసలు కూర, ఆకు కూర, ఉప్పేరి/తోరన్
సాధారణ ఆహారం: ధాన్యం, పప్పు కూర
మంగళవారం:
అల్పాహారం: న్యూట్రి లడ్డు
భోజనం: గుడ్డు బిర్యానీ/గుడ్డు పులావ్, ఫ్రూట్ బౌల్
సాధారణ ఆహారం: రాగి అడ
బుధవారం:
అల్పాహారం: పాలు, గంజి, కొబ్బరి/అరటి, వేరుశనగ మిఠాయి
భోజనం: పప్పు గంజి, కూరగాయల బంగాళాదుంప కూర, సోయా డ్రై ఫ్రై,
సాధారణ ఆహారం: ఇడ్లీ, సాంబార్, పుట్, పచ్చి బఠానీ కర్రీ
గురువారం:
అల్పాహారం: రాగి, బియ్యం గంజి/ఇలయప్పం
భోజనం: అన్నం, మొలకెత్తిన శనగలు, పాలకూర, సాంబార్, గుడ్డు, ఆమ్లెట్
సాధారణ ఆహారం: అవల్, బెల్లం, పండ్ల మిశ్రమం
శుక్రవారం:
అల్పాహారం: పాలు, ఓట్ మీల్
భోజనం: అన్నం, శనగ కూర, అవియల్, ఆకుకూరలు, తోరన్
సాధారణ ఆహారం: గోధుమ ముక్కలు పులావ్
శనివారం:
అల్పాహారం: న్యూట్రి లడ్డు
భోజనం: వెజిటబుల్ పులావ్, గుడ్డు, రైతా
సాధారణ ఆహారం: ధాన్యపు వంటకం
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




