AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seema Chintakaya: ఈ అరుదైన పండు పవర్ తెలిస్తే.. తినకుండా అస్సలు వదిలిపెట్టరు..!

సీమ చింతకాయ.. గ్రామీణ నేపథ్యం కలిగిన ప్రతి ఒక్కరికీ ఈ పండు గురించి తెలిసే ఉంటుంది. గతంలో గ్రామాల్లు, పల్లెల్లో ఈ సీమ చింతచెట్లు ఎక్కువగా కనిపించేవి.. కానీ, ప్రస్తుతం పట్టణీకరణ కారణంగా పల్లెలు కూడా కాంక్రీట్‌ జంగీల్‌లుగా మారిపోతున్నాయి. దీంతో ఇలాంటి చెట్లు నేటి తరానికి పరిచయం కూడా లేకుండా పోతున్నాయి. అయితే, సాధారణ చింతకాయతో పోలిస్తే.. సీమ చింతకాయ రుచిలో కాస్త వగరు, తీపి కలగలిసిన విలక్షణమైన రుచిని కలిగి ఉంటాయి. కానీ ఈ అరుదైన పండు కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాల విషయంలోనూ అద్భుతమైన నిధి లాంటిది అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. ఈ చిన్నసైజు సీమ చింతకాయతో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు..

Jyothi Gadda
|

Updated on: May 31, 2025 | 7:52 AM

Share
సీమ చింతకాయలలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గులాబీ, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉండే సీమ చింతకాయలు కాస్త తీయ్యగా, వగరుగా ఉంటాయి. కానీ, ఇందులోని పోషకాల విషయానికి వస్తే.. విటమిన్ ఎ, బి, సి, మెగ్నీషియం, ఐరన్, కాపర్, పాస్పరస్, ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా నిండివున్నాయి.

1 / 5
సీమ చింతకాయలు రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు దూరం అవుతాయి. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, ఏకాగ్రతను పెంచుతాయి. సీమ చింతకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి కఫాన్ని తగ్గిస్తుంది. గొంతు, చిగుళ్లు, నోటిపూత నివారణకు ఉపయోగపడుతుంది.

2 / 5
సీమ చింతకాయలు తరచూ తినడం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్తులకు కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. సీమ చింతకాయలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అకలి తగ్గుముఖం పడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. పీచు పదార్థాలు అధికంగా ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.

3 / 5
సీమ చింతకాయలోని గుణాలు గుండె ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును సమతుల్యంగా ఉంచడంలో సీమ చింతకాయ మరింత మేలు చేస్తుంది. క్షయవ్యాధి నివారణకు ఈ చెట్టు వేర్లు బాగా పనిచేస్తాయి.

4 / 5
సీమ చింతకాయలో ఉండే గుణాలు డయేరియా సమస్యను తగ్గిస్తాయి. తరచూ సీమ చింతకాయలను తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. చర్మంపై నల్లటి మచ్చలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. తరచూ సిమ చింతకాయలను తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. వీటి విత్తనాల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీలో వాడతారు.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..