Betel Leaf: ఉదయాన్నే ఖాళీ కడుపుతో తమలపాకులు తింటే ఏమౌతుందో తెలిస్తే…
తమలపాకు.. ఇది ఆకుపచ్చ రంగులో ఎంతో అందంగా మెరుస్తూ కనిపిస్తుంది. ఇలాంటి తమలపాకుని పూజాది శుభకార్యాలు మొదలుకుని చాలా రకాలుగా వాడతారు. ఆయుర్వేదంలో కూడా తమలపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తమలపాకులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయని చెబుతున్నారు. తాజా తమలపాకులో కాల్షియం, విటమిన్ సి, రైబోఫ్లేవిన్, కెరోటిన్, నియాసిన్, క్లోరోఫిల్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. తమలపాకుని సరిగ్గా తింటే చాలా ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకు తింటే ఏమౌతుందో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jun 03, 2025 | 1:08 PM

ఉదయాన్నే ఖాళీ కడుపున తమలపాకు తింటే జీర్ణవ్యవస్థ బలపడుతుంది. తేపులు, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దగ్గు, జలుబుకి కూడా తమలపాకు మంచి మందులా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తమలపాకు కషాయం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

తమలపాకులో యాంటీసెప్టిక్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణనిస్తాయి. తిన్న ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. పాన్ తింటే సున్నం బదులు గుల్కంద్, సోంపు, డ్రై ఫ్రూట్స్ వాడితే మంచిది. సున్నం ఆరోగ్యానికి హానికరం.

భోజనం చేసిన తరువాత రోజూ కొన్ని తమలపాకులు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. తమలపాకుల కషాయం తాగడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావం తగ్గుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరం.

నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. చిగుళ్ల నుంచి వచ్చే బ్లీడింగ్ తగ్గుతుంది. చర్మంపై ఉండే అలర్జీ, దురద వంటి సమస్యలు దూరమౌతాయి. తమలపాకులు తింటే ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి. ఓ గిన్నె నీటిలో తమలపాకులు వేసి బాగా మరగబెట్టాలి. ఆ తరువాత ఈ నీటిని రోజూ తాగితే వివిధ రకాల అనారోగ్య సమస్యలు దూరమౌతాయి.

వైద్య నిపుణుల ప్రకారం, రోజుకి రెండు, మూడు తమలపాకుల కంటే ఎక్కువ తినకూడదు. అలాగే వడలిన తమలపాకులో బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు పెరుగుతాయి. ఇవి జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపి, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అందుకే పాత తమలపాకు తినకూడదు. ఇది శరీరానికి హానికరం అంటున్నారు నిపుణులు.




