- Telugu News Photo Gallery These non veg foods in Karnataka are super, you should try them at least once
Karnataka Non-Veg Foods: కర్ణాటకలో ఈ నాన్ వెజ్ ఫుడ్స్ సూపర్.. ఒక్కసారైన టేస్ట్ చెయ్యాలి..
కర్ణాటక రాజధాని బెంగుళూరు నగరంలో చాలా కర్ణాటక వంటకాలు, అథెంటిక్ కన్నడ ఆహారాలు రుచి చూడటానికి ఉన్నాయి. బెంగుళూరులో ఉన్నప్పుడు ప్రయత్నించడానికి ఉత్తమమైన ప్రామాణికమైన కర్ణాటక నాన్ వెజ్ ఆహారాలు ఏంటి.? ఆ నాన్ వెజ్ ఫుడ్స్ గురించి మనం పూర్తి వివరాలతో తెలుసుకుందాం రండి..
Updated on: Jun 03, 2025 | 1:51 PM

డోన్ బిర్యానీ అనేది కర్ణాటక సిగ్నేచర్ బిర్యానీ. ఇది చికెన్, మటన్, వెజ్ అని చాల రకాలుగా దొరుకుతుంది. చాల రుచిగా ఉంటుంది. జీవితం ఒక్కరసరైన ట్రై చెయ్యాలి. ఇది బాస్మతి బియ్యం వలె కాకుండా చిట్టి ముత్యాల బియ్యంతో తయారు చేయబడుతుంది.

భత్కాలి బిర్యానీ మరొక సిగ్నేచర్ కర్ణాటక స్టైల్ బిర్యానీ, ఇది తీరప్రాంత కర్ణాటకలోని భత్కల్ పట్టణంలోని నవయత్ ముస్లిం సంఘం నుండి ఉద్భవించింది. ఇది కూడా వెజ్ అండ్ నాన్-వెజ్ రెండింటిలోని లభిస్తుంది. రుచి కూడా బాగానే ఉంటుంది.

కొర్రి గస్సీ.. ఇది ఒక మంగళూరు స్టైల్ చికెన్ కర్రీ. కాల్చిన మిరపకాయలు, సుగంధ ద్రవ్యాలు, క్రీము కొబ్బరి పాలతో తయారు చేయబడింది. ఇది మంగళూరులో ఎక్కువగా లబిస్తుంది. అక్కడికి వెళ్తే మాత్రం ట్రే చేయడం మర్చిపోకండి.

కుందాపుర కోలి సారూ సిగ్నేచర్ చికెన్ కర్రీని మీరు తప్పకుండా రుచి చూడాలి. ఇది రుచికరమైన మంగళూరు-శైలి చికెన్ గ్రేవీ. మంగళూరులో తప్పక టేస్ట్ చేయవల్సిన నాన్-వెజ్ ఆహారాల్లో ఇది కూడా ఒకటి. అక్కడికి వెళ్తే తప్పక తినండి.

కూర్గ్ పాండి కర్రీ అనేది కర్నాటక సంప్రదాయ పద్ధతిలో పంది మాంసంతో చేసిన కూర. పంది మాంసం ఇష్టపడేవారు కర్ణాటకలోని దిన్ని మిస్ అవకుండా తినండి. కర్ణాటక-శైలి మసాలాలు, సుగంధాలు ఉపయోగించి చేస్తారు.




