- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress In This Photo, She Is Drishyam Movie Fame Ester Anil
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
సౌత్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగానే పాపులర్ అయ్యింది. తెలుగు, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..?
Updated on: Jun 03, 2025 | 1:59 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న చైల్డ్ ఆర్టిస్టు ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు తెలుగు, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఇంతకీ ఈ భామ ఎవరంటే..

ఆమె మరెవరో కాదు.. ఎస్తర్ అనిల్. మలయాళంలో మోహన్ లాల్ నటించిన దృశ్యం సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఇందులో మోహన్ లాల్ చిన్న కూతురుగా నటించి మెప్పించింది.

అప్పట్లో బాలనటిగా మెప్పించిన ఎస్తర్ అనిల్.. ఇప్పుడు కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతుంది. సోషల్ మీడియాలో అందాల వయ్యరాలతో మెస్మరైజ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఈ భామ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

ప్రస్తుతం ఎస్తర్ అనిల్ హీరోయిన్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలోనే నెట్టింట యాక్టివ్ గా ఉంటూ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

వెంకటేశ్, మీనా కలిసి నటించిన దృశ్యం సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఎస్తర్ అనిల్ ఫేమస్ అయ్యింది.




