AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Covid-19: కరోనాతో ముగ్గురు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..

భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. పదులు, వందలుగా ఉన్న కేసులు.. ఇప్పుడు వేలకువేలుగా పెరిగిపోవడం భయాందోళన కలిగిస్తోంది.. గురువారం కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో (గురువారం ఉదయం) దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,154కి పెరిగిందని ఆరోగ్య - కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

India Covid-19: కరోనాతో ముగ్గురు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..
Coronavirus
Shaik Madar Saheb
|

Updated on: Jun 12, 2025 | 1:02 PM

Share

భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. పదులు, వందలుగా ఉన్న కేసులు.. ఇప్పుడు వేలకువేలుగా పెరిగిపోవడం భయాందోళన కలిగిస్తోంది.. గురువారం కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో (గురువారం ఉదయం) దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,154కి పెరిగిందని ఆరోగ్య – కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 33 కేసులు నమోదయ్యాయి. 983 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గురువారం కొత్తగా 3 కోవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి.. మహారాష్ట్రలో రెండు, మధ్యప్రదేశ్‌లో ఒకరు మరణించారు. 2025 జనవరి నుంచి మొత్తం మరణాల సంఖ్య 77కి చేరుకుంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 8,000 మందికి పైగా ఈ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం డేటాలో వెల్లడించింది.

దాదాపు అన్ని రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులలో స్వల్ప పెరుగుదల నమోదైనప్పటికీ.. కేరళలో అత్యధిక సంఖ్యలో కోవిడ్ -19 కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఉదయం యాక్టివ్ కేసుల సంఖ్య 2165 గా ఉంది. ఇండియా కోవిడ్ -19 డాష్‌బోర్డ్ ప్రకారం.. గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువ సంఖ్యలో యాక్టివ్ కేసులను నివేదించాయి. ఇదిలాఉంటే.. ఏపీలో 30 కేసులు పెరిగి.. యాక్టివ్ కేసుల సంఖ్య 103కి చేరుకుంది. తెలంగాణలో 1 కేసు నమోదు కాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 12కి చేరింది.

కరోనా కేసులు లైవ్ ట్రాకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రుల సంసిద్ధతను అంచనా వేయడానికి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లను ప్రారంభించింది.. తగినంత ఆక్సిజన్ సరఫరా, ఐసోలేషన్ పడకలు, వెంటిలేటర్లు, అవసరమైన మందులు ఉండేలా చూసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. చాలా కేసులు తేలికపాటివని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇంటి సంరక్షణలో ఉంటే సరిపోతుందని.. ఏమైనా జబ్బులు ఉంటే చికిత్స తీసుకోవాలని సూచించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..