Gold Rate Today: ఓర్నాయనో.. ఇక బంగారం కొనడం కష్టమే.. మళ్లీ భారీగా పెరిగిన ధరలు..
Gold And Silver Price In Hyderabad - Vijayawada: బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రెండు నెలల క్రితం లక్ష రూపాయలను ఢీకొట్టిన బంగారం ధర ఆ తర్వాత మెల్లిగా తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే.. గురువారం బంగారం ధర భారీగా పెరిగింది.

Gold And Silver Price In Hyderabad – Vijayawada: బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రెండు నెలల క్రితం లక్ష రూపాయలను ఢీకొట్టిన బంగారం ధర ఆ తర్వాత మెల్లిగా తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే.. గురువారం బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర లక్ష మార్కుకు చేరువైంది. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,280గా ఉంది. కిలో వెండి ధర ఒక లక్షా 9వేలు పలుకుతోంది. అయితే.. ప్రాంతాల వారీగా బంగారం ధరలు మారుతుంటాయి.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.880 పెరిగి రూ.99,280 కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.800 పెరిగి రూ.91,000 లుగా ఉంది. కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ. 1,18,900గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.880 పెరిగి రూ.99,280 కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.800 పెరిగి రూ.91,000 లుగా ఉంది. కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.1,18,900గా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 9,928, 22 క్యారెట్ల ధర 90,100 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,08,900 లుగా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.99,430, 22 క్యారెట్ల ధర 90,115గా ఉంది కిలో వెండి ధర రూ.1,08,900 లుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.99,280, 22 క్యారెట్ల ధర 90,100గా ఉండగా.. కిలో వెండి ధర రూ.1,18,900 లుగా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల పసిడి ధర రూ.99,280, 22 క్యారెట్ల ధర 90,100గా ఉండగా.. కిలో వెండి ధర రూ.1,08,900 లుగా ఉంది.
వాస్తవానికి పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి.. అయితే.. ఇటీవల కాలంలో తగ్గినట్లే తగ్గి.. మళ్లీ బంగారం ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితితో పాటు అమెరికా చైనా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరో పక్క వెండి కూడా తగ్గేదేలే అన్నట్లుగా తన పెరుగుదలను కొనసాగిస్తూనే ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




