Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మ బాబోయ్.. పెరుగుతున్న కరోనా కేసులు.. జనవరి నుంచి ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారంటే..

దేశంలో మరోసారి అడుగుపెట్టిన కరోనా రక్కసి.. అంతకంతకూ విజృంభిస్తోంది. పదులు, వందలుగా ఉన్న కేసులు... ఇప్పుడు వేలకువేలుగా పెరిగిపోవడం చూస్తుంటే మళ్లీ పాతరోజులొస్తాయా అన్న భయాందోళన వ్యక్తమవుతోంది. కొన్ని రోజుల్లోనే మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 6 వేలు క్రాస్‌ అయింది.. భారతదేశంలో ఆదివారం నాటికి యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 6000 మార్కును దాటింది..

అమ్మ బాబోయ్.. పెరుగుతున్న కరోనా కేసులు.. జనవరి నుంచి ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారంటే..
India Coronavirus Cases
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 09, 2025 | 12:53 PM

దేశంలో మరోసారి అడుగుపెట్టిన కరోనా రక్కసి.. అంతకంతకూ విజృంభిస్తోంది. పదులు, వందలుగా ఉన్న కేసులు… ఇప్పుడు వేలకువేలుగా పెరిగిపోవడం చూస్తుంటే మళ్లీ పాతరోజులొస్తాయా అన్న భయాందోళన వ్యక్తమవుతోంది. కొన్ని రోజుల్లోనే మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 6 వేలు క్రాస్‌ అయింది.. భారతదేశంలో ఆదివారం నాటికి యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 6000 మార్కును దాటింది.. ప్రస్తుతం దేశంలో 6491 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 358 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో ఎలాంటి మరణాలు నమోదుకాలేదు.. ఆదివారం మాత్రం ఆరు మరణాలు నమోదయ్యాయి.

కేరళలో 144 కొత్త కేసులు నమోదయ్యాయి.. గుజరాత్, పశ్చిమ బెంగాల్ వరుసగా 105, 71 కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జనవరి 1, 2025 నుండి దేశంలో ఇప్పటివరకు కోవిడ్-19 కారణంగా మొత్తం 65 మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో 753 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. కేరళ, ఢిల్లీ, గుజరాత్‌, బెంగాల్‌, కర్నాటకలో కొవిడ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 6861 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఇచ్చిన గణాంకాల ప్రకారం.. కేరళ 1957, గుజరాత్‌లో మొత్తం 980, ఢిల్లీ 728, ఆంధ్రప్రదేశ్ 85, తెలంగాణ 9 లో కరోనా కేసులు ఉన్నాయి.

గుజరాత్ లో బాలిక మృతి..

ఇదిలాఉంటే.. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో 16 ఏళ్ల బాలిక కరోనాతో మరణించింది. రెమ్‌డెసివిర్, టోసిలిజుమాబ్ ఇచ్చిన తర్వాత కూడా ప్రాణాలు దక్కలేదు.. ఆ బాలిక జూన్ 4 నుండి సోలా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కరోనాతో చాలా కాలంగా చికిత్స పొందుతున్న ఆ బాలిక మరణించడంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

కరోనా కేసులు లైవ్ ట్రాకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందా?

దేశంలోని చాలా కోవిడ్ కేసులు JN.1, NB.1.8.1, LF.7 వంటి ఒమిక్రాన్ ఉపరకాలతో ముడిపడి ఉన్నాయి. ఈ వైరస్ లు త్వరగా వ్యాప్తి చెందుతాయి.. కానీ అవి అంత ప్రమాదకరమైనవి కావు. వాటి లక్షణాలు కూడా తేలికపాటివి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు, శ్వాసకోశ వ్యాధులు ఉన్న రోగులు, వృద్ధులు, చిన్న పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్‌గా గిరిజన బిడ్డ రికార్డ్..!
తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్‌గా గిరిజన బిడ్డ రికార్డ్..!
పెళ్లి చేసుకోను.. కానీ నాకు పార్ట్‌నర్ కావాలి..
పెళ్లి చేసుకోను.. కానీ నాకు పార్ట్‌నర్ కావాలి..
IND vs NZ: 15 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం..
IND vs NZ: 15 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం..
కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడని పురుగుల మందు తాగాడు.. చివరకు..
కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడని పురుగుల మందు తాగాడు.. చివరకు..
ఈ విదేశీ పర్యటనతో చరిత్ర సృష్టించబోతున్న ప్రధాని మోదీ!
ఈ విదేశీ పర్యటనతో చరిత్ర సృష్టించబోతున్న ప్రధాని మోదీ!
టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే సెంచరీతో సెలెక్టర్లకు కౌంటర్
టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే సెంచరీతో సెలెక్టర్లకు కౌంటర్
మరో ఘోర విషాదం.. కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్!
మరో ఘోర విషాదం.. కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్!
పోలీసులా వచ్చి కాల్పులు జరిపిన దుండగుడు.. అమెరికాలో దారుణం..
పోలీసులా వచ్చి కాల్పులు జరిపిన దుండగుడు.. అమెరికాలో దారుణం..
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు!
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు!
అడవి శేష్‌కు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..
అడవి శేష్‌కు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..