Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: భారత్‌లో 6వేలు దాటిన కరోనా యాక్టివ్‌ కేసులు.. 24 గంటల్లో వైరస్‌తో ఆరుగురు మృతి

కొత్తగా వస్తోంది...! సరికొత్త రాగంతో మెల్లమెల్లగా మరణమృదంగం మోగిస్తూ... జనాల్లో భయం పుట్టిస్తోంది. దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్న తీరు ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో ఆరుగురు మృతి చెందడం పాత రోజుల్ని గుర్తుచేస్తోంది. దేశంలో వైరస్ లేటెస్ట్ అప్ డేట్స్ ఇలా ఉన్నాయి..

Coronavirus: భారత్‌లో 6వేలు దాటిన కరోనా యాక్టివ్‌ కేసులు.. 24 గంటల్లో వైరస్‌తో ఆరుగురు మృతి
India Corona Cases
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 08, 2025 | 9:46 PM

దేశంలో మరోసారి అడుగుపెట్టిన కరోనా రక్కసి… అంతకంతకూ విజృంభిస్తోంది. పదులు, వందలుగా ఉన్న కేసులు… ఇప్పుడు వేలకువేలుగా పెరిగిపోవడం చూస్తుంటే మళ్లీ పాతరోజులొస్తాయా అన్న భయాందోళన వ్యక్తమవుతోంది. దేశంలో కొత్తగా 11 వందలకు పైగా కేసు నమోదవ్వగా… మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 6వేలు క్రాస్‌ చేసింది. గత 24 గంటల్లో కొవిడ్‌తో ఆరుగురు మృతి చెందడం బెంబేలెత్తిస్తోంది. కేరళలో ముగ్గురు, కర్నాటకలో ఇద్దరు మృతి, తమిళనాడులో ఒకరు కరోనాతో మృతి చెందారు. ఇక 1950 కేసులతో కేరళ టాప్‌లో ఉండగా ఆర్వాత 822 కేసులతో గుజరాత్‌ సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. ఇక పశ్చిమ బెంగాల్‌లో 693 కేసులు నమోదవ్వగా… మహారాష్ట్రలో 595, కర్నాటకలో 366 యాక్టివ్‌ కేసులున్నారు. ఇటు ఏపీలో 86, తెలంగాణలో 10 యాక్టివ్‌ కేసులున్నట్లు వెల్లడించారు అధికారులు.

ఇక దేశవ్యాప్తంగా కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తుండటంతో తెలుగు రాష్ట్రాలు అలర్ట్‌ అయ్యాయి. ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కొవిడ్ ప్రత్యేక వార్డులు, స్క్రీనింగ్ సెంటర్లను ప్రారంభించారు. కొవిడ్ పరీక్షలను కూడా పెంచాల‌ని వైద్యారోగ్య శాఖ నుంచి ఆదేశాలొచ్చాయి. జ్వరం, దగ్గు, జలుబుతో ఎవరు వచ్చినా టెస్టులు తప్పనిసరి చేస్తున్నారు. ఇక తెలంగాణలో కొవిడ్ కంట్రోల్‌లోనే ఉంది. అయితే, కొవిడ్‌ కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే.. ఒకవేళ కేసుల సంఖ్య పెరిగినా సరే వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు అధికారులు. ఇప్పటికే ఆక్సీజన్ సిలిండర్లు, బెడ్లు, కావాల్సిన అన్ని సదుపాయాలతో రెడీగా ఉన్నాయని తెలిపారు. అన్ని జిల్లాలకు గైడ్‌లైన్స్‌ కూడా పంపించారు. మొత్తంగా ప్రస్తుతానికైతే ఆందోళన అక్కర్లేదంటున్న వైద్యులు… అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?