Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Solstice 2023: నేడే శీతాకాలపు అయనాతంతం.. నేటి రాతిరి సుధీర్ఘమైనది! ఎందుకో తెలుసా

ప్రకృతి రహస్యలు మానవ ఊహకు అందనివి. ఒక్కో సీజన్‌ ఒక్కోలా పలకరించి పులకరింప చేస్తుంటాయి. ప్రస్తుతం శీతాకాలం గజగజలాడిస్తోంది. మీకు తెలుసా? ఈ రోజు రాత్రి సుదీర్ఘంగా ఉండబోతుంది. అంటే పగలు తక్కువగా.. రాత్రి ఎక్కువగా ఉంటుందట. సాధారణంగా ప్రతి యేటా డిసెంబర్‌ 21 లేదా డిసెంబర్‌ 22 తేదీల్లో ఇలా జరుగుతుంది. ఇలా ప్రపంచం మొత్తం ఉండదు. ఒక్కరోజు మాత్రమే అదీ మన దేశంలో మాత్రమే ఉంటుంది..

Winter Solstice 2023: నేడే శీతాకాలపు అయనాతంతం.. నేటి రాతిరి సుధీర్ఘమైనది! ఎందుకో తెలుసా
Winter Solstice
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 24, 2023 | 6:25 AM

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 22: ప్రకృతి రహస్యలు మానవ ఊహకు అందనివి. ఒక్కో సీజన్‌ ఒక్కోలా పలకరించి పులకరింప చేస్తుంటాయి. ప్రస్తుతం శీతాకాలం గజగజలాడిస్తోంది. మీకు తెలుసా? ఈ రోజు రాత్రి సుదీర్ఘంగా ఉండబోతుంది. అంటే పగలు తక్కువగా.. రాత్రి ఎక్కువగా ఉంటుందట. సాధారణంగా ప్రతి యేటా డిసెంబర్‌ 21 లేదా డిసెంబర్‌ 22 తేదీల్లో ఇలా జరుగుతుంది. ఇలా ప్రపంచం మొత్తం ఉండదు. ఒక్కరోజు మాత్రమే అదీ మన దేశంలో మాత్రమే ఉంటుంది. ఈ దృగ్విషయాన్ని శీతాకాలపు అయనాంతం (వింటర్‌ సోల్‌స్టైస్) అని పిలుస్తారు.

ఎందుకిలా జరుగుతుందంటే..

శీతాకాలపు అయనాంతం ఎలా వస్తుందంటే.. భూమి ఉత్తర అర్ధగోళం సూర్యుని నుంచి దూరంగా వంగినప్పుడు శీతాకాలపు అయనాంతం ఏర్పడుతుంది. ఏటా సంభవించే ఒక దృగ్విషయం. దీని ఫలితంగా సంవత్సరంలో ఒక రోజు సుదీర్ఘమైర రాత్రి, అతి తక్కువ పగలు ఉంటాయి. ఈ సమయంలో భూమి తన అక్షం మీద 23.4 డిగ్రీలు వంగి ఉంటుంది. ఈ కారణంగా భూమి ధ్రువం పగటిపూట సూర్యుడికి దూరంగా ఉంటుంది. సూర్యుడు ప్రయాణించే ఆర్క్ సంవత్సరంలో పెరుగుతూ.. తరుగుతూ ఉంటుంది.

భారతదేశ కాలమానం ప్రకారం..

ఈ ఏడాది మన దేశంలో అతి తక్కువ రోజు డిసెంబర్ 22 అంటే ఈ రోజు అనుభవిస్తుంది. మన దేశకాలమానం ప్రకారం అయనాంతం ఉదయం 8.57 గంటలకు సంభవిస్తుంది. ఫలితంగా ఉత్తర అర్ధగోళంలో పగటిపూట అతితక్కువ ఉంటుంది. అంటే ఈ రోజు కేవలం 7 గంటల 14 నిమిషాలు మాత్రమే పగటి వెలుతురు ఉంటుందన్న మాట. పగలు తర్వగా ముగిసి, రాత్రి త్వరత్వరగా ప్రారంభమవుతుంది. దాదాపు 13 గంటల 38 నిమిషాల పాటు రాత్రి సమయం ఉంటుంది. ఈ ఏడాది జూన్ 21వ తేదీన కూడా ఇదే తరహాలో లాంగెస్ట్ డే నమోదైంది.

ఇవి కూడా చదవండి

శీతాకాలపు అయనాంతం 2023 ఎలా గుర్తిచాలి?

అయనాంతం రోజున సూర్యోదయం, సూర్యాస్తమయం చూడటం ద్వారా దీనిని గుర్తించవచ్చు. ప్రతి యేట ఈ అద్భుతాన్ని వీక్షించడానికి అత్యంత ప్రజాదరణ పొందిన వార్షిక సంప్రదాయం సూర్యోదయాన్ని చూడటానికి ఇంగ్లాండ్‌లోని స్టోన్‌హెంజ్‌లో చూడటానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. శీతాకాలపు అయనాంతం వేసవి కాలానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అలాగే సమ్మర్ సోల్‌స్టైస్ కూడా ఉంటుంది. ఆ రోజు రాత్రి తక్కువగా పగలు ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా సమ్మర్ సోల్‌స్టైస్ ప్రతీయేట జూన్ 20 నుంచి 22 మధ్య వస్తుంది. అదే లీపు సంవత్సరం అయితే జూన్ 20న వస్తుంది. సాధారణ సంవత్సరం అయితే జూన్‌ 22న వస్తుంది.

సమ్మర్ సోల్‌స్టైస్ రోజున నార్వే, ఫిన్లాండ్, గ్రీన్‌లాండ్, అలస్కా సహా పలు దేశాల్లో ధ్రువ ప్రాంతాల్లో అర్ధరాత్రి కూడా సూర్యుడు ప్రకాశిస్తాడు. ఆటమ్ ఈక్వినోక్స్ అంటే పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఇది సెప్టెంబర్‌ 23వ తేదీన వస్తుంది. ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతంలో సూర్యుడు అస్సలు అస్తమించడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.