Viral: ఇది పిజ్జా కాదు.. అంతకు మించి.! ఆకట్టుకుంటున్న అతిపెద్ద పరోటా.. వీడియో వైరల్‌.

Viral: ఇది పిజ్జా కాదు.. అంతకు మించి.! ఆకట్టుకుంటున్న అతిపెద్ద పరోటా.. వీడియో వైరల్‌.

Anil kumar poka

|

Updated on: Dec 22, 2023 | 3:58 PM

ప్రతిఒక్కరిలోనూ ఏదో ఒక ట్యాలెంట్ దాగి ఉంటుంది. ఏదో ఒకసమయంలో అది బయటపడుతుంది. ఇటీవల ఇంటర్నెట్‌ సౌలభ్యం బాగా పెరిగడంతో ఎందరో ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. ప్రతిభకు విద్యతో పనిలేదని ఎందరో నిరూపించారు. తాజాగా ఓ వ్యక్తి తను పనిచేసే హోటల్‌లో అతిపెద్ద పరోటాను తయారు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు వావ్‌.. దీనిముందు పిజ్జా ఎందుకూ పనికిరాదంటున్నారు.

ప్రతిఒక్కరిలోనూ ఏదో ఒక ట్యాలెంట్ దాగి ఉంటుంది. ఏదో ఒకసమయంలో అది బయటపడుతుంది. ఇటీవల ఇంటర్నెట్‌ సౌలభ్యం బాగా పెరిగడంతో ఎందరో ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. ప్రతిభకు విద్యతో పనిలేదని ఎందరో నిరూపించారు. తాజాగా ఓ వ్యక్తి తను పనిచేసే హోటల్‌లో అతిపెద్ద పరోటాను తయారు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు వావ్‌.. దీనిముందు పిజ్జా ఎందుకూ పనికిరాదంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి హోటల్ కిచెన్‌లో చాలా బిజీగా ఉన్నాడు. అతను పరోటా తయారు చేయడానికి పిండి కలుపుతున్నాడు. ఇందులో విశేషమేముంది అనుకోకండి.. అతను ఓ భారీ పరోటాను సిద్ధం చేస్తున్నాడు. అది కూడా ఒక్కడే. సుమారు రెండు మూడు కేజీల పిండిని ముద్దలా కలిపి చపాతీ కర్రతో వత్తాడు. దానిని చూస్తే పిజ్జా బేస్‌లా అనిపిస్తోంది. దానిపైన ఒక బౌల్‌తో కర్రీ తీసుకొచ్చి కుమ్మరించాడు. దానిని చక్కగా ఒక మూటలా కట్టాడు. ఆపైన దానిని రౌండ్‌గా బాల్‌లా చేశాడు. ఇప్పుడు మరోసారి చపాతీలాగా ఒత్తాడు. అంతే అతి పెద్ద పరోటా రెడీ అయిపోయింది. దానిని జాగ్రత్తగా తీసుకెళ్ళి పెద్ద పెనం మీద కాల్చాడు. ఆహా.. సూపర్‌ పరోటా రెడీ అయిపోయింది.. దానిని ఓ పెద్ద పళ్లెంలో పెట్టి ముక్కలుగా కట్‌ చేసి సర్వ్‌ చేశారు. ఆ భారీ పరోటా 8 మంది కడుపునిండా తినొచ్చు. ఈ పరోటా తయారీకి సంబంధించిన వీడియోను మన టెక్‌ దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా వీక్షించారు. 18 వేల మందికి పైగా లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అద్భుతం.. పిజ్జాతో పోల్చుకుంటే ఇది చాలా ఆరోగ్యకరం.., సూపర్‌ ట్యాలెంట్“ అంటూ కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.