Viral: కొవిడ్‌తో మృతిచెందిన భర్త.. రెండేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన భార్య.!
పశ్చిమబెంగాల్‌లోని భీర్‌భూమ్ జిల్లాలో కొవిడ్‌తో మరణించిన భర్త వీర్యం ఆధారంగా ఓ మహిళ నడివయసులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఐవీఎఫ్ పద్ధతిలో జరిగిన ఈ ప్రక్రియ అనంతరం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. మురారై ప్రాంతానికి చెందిన సంగీత, అరుణ్‌ప్రసాద్‌లకు 27 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సంగీతకు గర్భాశయ సమస్యలు ఉండటం వల్ల చాలా ఏళ్లు సంతానం కలగలేదు.
కరోనా మహమ్మారి భర్తను బలి తీసుకోవడంతో ఒంటరిగా మిగిలింది ఆ మహిళ. అత్తమామలు చేరదీయలేదు. ఆదుకునేవారు లేరు. భర్త బ్రతికుండగా నడిపిన చిన్న కిరాణా దుకాణమే ఆమె ఒంటరి జీవితానికి జీవనాధారమైంది. ఈ క్రమంలో ఆమె తనకు ఓ తోడు కావాలనుకుంది. అందుకు బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమైంది. గతంలో భర్తపరచిని తన భర్తవీర్యంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పశ్చిమబెంగాల్‌లోని భీర్‌భూమ్ జిల్లాలో కొవిడ్‌తో మరణించిన భర్త వీర్యం ఆధారంగా ఓ మహిళ నడివయసులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఐవీఎఫ్ పద్ధతిలో జరిగిన ఈ ప్రక్రియ అనంతరం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. మురారై ప్రాంతానికి చెందిన సంగీత, అరుణ్‌ప్రసాద్‌లకు 27 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సంగీతకు గర్భాశయ సమస్యలు ఉండటం వల్ల చాలా ఏళ్లు సంతానం కలగలేదు. ఈ నేపథ్యంలో ఐవీఎఫ్ విధానంలో పిల్లల్ని కనాలని దంపతులు నిశ్చయించుకున్నారు. ఆ మేరకు రెండేళ్ల క్రితం అరుణ్‌ప్రసాద్ వీర్యాన్ని కోల్‌కతాలోని ఓ ల్యాబ్‌లో భద్రపరిచారు. ఆ తర్వాత అరుణ్‌కు కొవిడ్ సోకి మరణించారు. భర్త మరణంతో సంగీత కుంగిపోయింది. అత్తింటివారు పట్టించుకోలేదు. అరుణ్ నడిపిన కిరాణం దుకాణమే ఆమెకు ఆధారమైంది. ఒంటరిగా మారిన సంగీత.. భద్రపరచిన భర్త వీర్యం సాయంతో బిడ్డను కనాలని నిర్ణయించుకుంది. అలా అరుణ్ వీర్యాన్ని ఆమె అండంలోకి ప్రవేశపెట్టడం ద్వారా గర్భవతి అయ్యింది. డిసెంబరు 12న రాంపుర్‌హాట్ వైద్య కళాశాల ఆస్పత్రిలో సంగీత మగబిడ్డకు జన్మనిచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

