Dinosaur Eggs: వామ్మో.. కులదేవతలనుకుని ఆ ఊర్లో డైనోసార్ గుడ్లకు తరతరాలుగా పూజలు! అవాక్కైన గ్రామస్థులు

ఎన్నో యేళ్లుగా ఆ ఊరి ప్రజలు గ్రామదేవతలుగా భావించి గుండ్రని రాళ్లకు పూజలు చేస్తున్నారు. తాజాగా ఆ ఊరిని సందర్శించిన సైంటిస్టులు ఆ రాళ్లను పరీక్షించగా అవి శిలాజాలుగా మారిన డైనోసార్‌ గుడ్లని తేలింది. ఇన్నాళ్లు తమకు తెలియకుండానే డైనోసార్‌ గుడ్లకు పూజలు చేశామని తెలుసుకున్న గ్రామస్థులు ముక్కున వేలేసుకున్నారు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

Dinosaur Eggs: వామ్మో.. కులదేవతలనుకుని ఆ ఊర్లో డైనోసార్ గుడ్లకు తరతరాలుగా పూజలు! అవాక్కైన గ్రామస్థులు
Dinosaur Eggs
Follow us
Srilakshmi C

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 22, 2023 | 11:34 AM

మధ్యప్రదేశ్‌, డిసెంబర్‌ 22: ఎన్నో యేళ్లుగా ఆ ఊరి ప్రజలు గ్రామదేవతలుగా భావించి గుండ్రని రాళ్లకు పూజలు చేస్తున్నారు. తాజాగా ఆ ఊరిని సందర్శించిన సైంటిస్టులు ఆ రాళ్లను పరీక్షించగా అవి శిలాజాలుగా మారిన డైనోసార్‌ గుడ్లని తేలింది. ఇన్నాళ్లు తమకు తెలియకుండానే డైనోసార్‌ గుడ్లకు పూజలు చేశామని తెలుసుకున్న గ్రామస్థులు ముక్కున వేలేసుకున్నారు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని పడ్లియా గ్రామంలోని కుల దేవతలుగా భావించి కొన్ని రాళ్లకు గ్రామస్థులు గత కొన్నేళ్లుగా పూజలు చేస్తున్నారు. తాజాగా డైనోసార్ ఫాసిల్స్ పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించడానికి సైంటిస్టుల బృందం ఆ ఊరిని సందర్శించింది. డాక్టర్ మహేష్ ఠక్కర్, డాక్టర్ వివేక్ వి కపూర్, డాక్టర్ శిల్పాల అక్కడ వర్క్‌షాప్ నిర్వహించారు. వర్క్‌షాప్ సమయంలో వెస్టా పటేల్ అనే స్థానికుడు గుండ్రని రాళ్లను ‘కాకడ్ భెరవ్’గా భావించి పూజిస్తామని వారికి తెలియజేశాడు. ‘కాకడ్’ అని పిలిచే ఈ రాళ్లను పొలాల సరిహద్దుల్లో పూజిస్తామని తెలిపాడు. సరిగ్గా అలాంటి రాళ్లే డైనోసార్ శిలాజాల పార్క్ ప్రాంగణంలో రెండు ఉన్నాయి. దీంతో వాటిని పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లారు. పరీక్షించగా అవి డైనోసార్ గుడ్లని తెలిసింది. అవి శిలాజాలుగా మారిన డైనోసార్‌ గుడ్లని నిపుణులు తేల్చడంతో గ్రామస్థులు ఆశ్చర్యపోయారు.

కుల దేవతలుగా భావించే ఈ గుండ్రని రాళ్లను స్థానిక ప్రజలు పూజా ఆచారాలలో వినియోగిస్తారు. ఈ రాళ్లను తరతరాలుగా పూజిస్తున్నట్లు తెలిపారు. సుమారు 18 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఈ డైనోసార్‌ గుడ్లకు కొబ్బరి కాయలను నైవేద్యంగా పెట్టేవారు. ఆ గ్రామం ఉన్న ప్రాంతం నర్మదా వ్యాలీ ప్రాంతమని, లక్షల సంవత్సరాల క్రితం డైనోసార్లు ఈ ప్రాంతంలో జీవించి ఉన్నట్లు అక్కడి ఆధారలాను బట్టి సైంటిస్టులు తెలిపారు. ఇదే ప్రాంతంలో గతంలో కూడా 256 డైనోసార్‌ గుడ్లు కనుగొన్నారు. వాటిని పరిరక్షించడానికి ఈ జిల్లాలో 2011లో డైనోసార్‌ శిలాజాల జాతీయ పార్కును కూడా ఏర్పాటు చేశారు. ఇక తాజాగా డైనోసార్‌ గుడ్లు లభించిన ప్రాంతానికి అధికారులు చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..