Lord Shaniswara: హిందూమతంలో కాకి చాలా ప్రత్యేకం.. కాకి శనీశ్వరుడికి వాహనంగా ఎలా మారిందంటే.. ?
శనీశ్వరుడు కాకిపై స్వారీ చేస్తూ కనిపిస్తాడు. అయితే శనిదేవుడికి ఒకటి కాదు 9 వాహనాలు ఉన్నాయి. ప్రతి వాహనానికి ఒక విశిష్టత ఉంది. పురాణాల ప్రకారం శనీశ్వరుడి వాహనం అయిన కాకి ఆధ్యాత్మిక జీవుల్లో ఒకటి. ఇది ప్రమాదాన్ని సులభంగా పసిగట్టడమే కాకుండా.. తాను ఎక్కడ నివసించినా ఆ పరిసరాలు అందంగా ఉండేలా చూస్తుంది. ఆనందాన్ని ఇస్తుంది. శనీశ్వరుడి అనుగ్రహం వల్ల కాకులు ఎప్పుడూ అనారోగ్యం బారిన పడవని కూడా నమ్మకం.
హిందూ మతంలో గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. నవ గ్రహాల్లో సూర్యుడి తనయుడు శనీశ్వరుడిని న్యాయ దేవుడు అని పిలుస్తారు. శనీశ్వరుడు శివునికి గొప్ప భక్తుడు. కర్మ ప్రదాత అయిన శనీశ్వరుడు వ్యక్తికి చేసే పనులకు తగిన ఫలితాలను ఇవ్వడమే కాదు.. మంచి పనులను చేసే వ్యక్తిపై తన ఆశీర్వాదాలను ఇస్తాడు. చెడు కర్మలు చేస్తే తగిన విధంగా శిక్షలను ఇస్తాడు. శనీశ్వరుడు సాధారణంగా చేతిలో కత్తి, విల్లుని ధరించి దర్శనమిస్తాడు. ఇవి శిక్షలకు, న్యాయాలను ఇచ్చే సామర్థ్యానికి సూచనగా భావిస్తారు
అయితే శనీశ్వరుడు కాకిపై స్వారీ చేస్తూ కనిపిస్తాడు. అయితే శనిదేవుడికి ఒకటి కాదు 9 వాహనాలు ఉన్నాయి. ప్రతి వాహనానికి ఒక విశిష్టత ఉంది.
పురాణాల ప్రకారం శనీశ్వరుడి వాహనం అయిన కాకి ఆధ్యాత్మిక జీవుల్లో ఒకటి. ఇది ప్రమాదాన్ని సులభంగా పసిగట్టడమే కాకుండా.. తాను ఎక్కడ నివసించినా ఆ పరిసరాలు అందంగా ఉండేలా చూస్తుంది. ఆనందాన్ని ఇస్తుంది. శనీశ్వరుడి అనుగ్రహం వల్ల కాకులు ఎప్పుడూ అనారోగ్యం బారిన పడవని కూడా నమ్మకం.
కాకి శనీశ్వరుడు వాహనం ఎలా అయింది?
హిందూ పురాణాల ప్రకారం సూర్యుడి భార్య సంధ్య . సూర్యుడి వేడిని తట్టుకోలేక తన నీడను సృష్టించి ఛాయ అనే పేరుతో సూర్యుడి సేవకు వినియోగించి తపస్సు చేయడానికి వెళ్ళింది. సంధ్య తన ఇద్దరు పిల్లలైన యమ, యమునా దేవిని ఛాయకు అప్పగించింది. సంధ్య తపస్సు ముగిసే సమయానికి ఛాయ .. సూర్యుడులకు శనీశ్వరుడు జన్మించాడు. ఈ విషయం సంధ్యకు తెలియగానే ఆమె చాలా కోపం వచ్చింది. సూర్య దేవుడుకి అసలు విషయం తెలిసి ఛాయను, శనీశ్వరుడిని విడిచిపెట్టాడు.
సంధ్య , సూర్యుడుల ప్రవర్తనకు విచారంతో.. ఛాయ శనీశ్వరుడుతో కలిసి అడవికి వెళ్ళింది. ఛాయ.. శనీశ్వరుడు అడవిలో నివసిస్తున్నారని తెలుసుకున్న సూర్యుడు, వారిద్దరినీ చంపడానికి అడవికి నిప్పంటించాడు. ఆ తర్వాత ఛాయ నీడగా మారి మంటల నుండి తప్పించుకుంది. అయితే శనీశ్వరుడు మంటల్లో చిక్కుకున్నాడు. అంతేకాదు శనీశ్వరుడుతో కలిసి అడవుల్లో నివసిస్తున్న వారు మరణించారు. ఈ సమయంలో ఒక కాకి ఆ మంటల నుండి శనీశ్వరుడిని బయటకు తీసింది. అప్పటి నుంచి కాకి శనీశ్వరుడికి ఇష్టమైనదిగా మారింది. ఆ తర్వాత కాకిని తన వాహనంగా చేసుకున్నాడు.
ఒకరోజు కాకి శనిదేవునితో కలిసి కాకిలోకం చేరుకుంది. కాకి తల్లి శనీశ్వరుడిని తన కొడుకు అని సంబోధించి ప్రేమ, ఆప్యాయతలను పంచింది. కాకి తన తల్లిని శనీశ్వరుడు కూడా తమ ఉంచుకుందామని కోరతాడు. దీంతో శనీశ్వరుడు తన ఉంచుకుని ప్రేమగా చూసుకుంటుంది. అనంతరం శనిదేవుడు కాకిని తన వాహనంగా చేసుకున్నాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు