శ్రీశైలంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. భక్తుల రద్దీ.. రావణ వాహనంలో స్వామిఅమ్మవార్ల దర్శనం..

స్వామి అమ్మవార్లు రావణ వాహనంపై ఆలయ ప్రదక్షిణ సాగుతుండగా భక్తులు భక్తి శ్రద్ధలతో రావణ వాహనంలో ఉన్న స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో శ్రీశైలం ఆలయం ఉత్తర ద్వారం దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 6 గంటల నుంచి స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

శ్రీశైలంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. భక్తుల రద్దీ.. రావణ వాహనంలో స్వామిఅమ్మవార్ల దర్శనం..
Sri Sailam Devotee Rush
Follow us
J Y Nagi Reddy

| Edited By: Surya Kala

Updated on: Dec 23, 2023 | 8:39 AM

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో శ్రీ భ్రమరాంబా సమేత మల్లి కార్జునస్వామివారు రావణ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయలోని ఉత్తర ద్వారం వద్ద ఉత్తర ముఖంగా స్వామి అమ్మవార్లను రావణ వాహనంపై ఆశీనులను చేసి అర్చకులు వేదపండితుల ప్రత్యేక పూజలు నిర్వహించి హరతులిచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్లు రావణ వాహనంపై ఆలయ ప్రదక్షిణ సాగుతుండగా భక్తులు భక్తి శ్రద్ధలతో రావణ వాహనంలో ఉన్న స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

ఇవి కూడా చదవండి

ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో శ్రీశైలం ఆలయం ఉత్తర ద్వారం దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 6 గంటల నుంచి స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లలో భక్తులు ఉత్తర ద్వారాం దర్శనానికి భక్తులు భారులు తీరారు. స్వామి అమ్మవారి గ్రామోత్సవంలో ఈఓ పెద్దిరాజు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి భక్తులు పాల్గోని దర్శించుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..