చక్కులతుకవు దేవాలయం కేరళలో ప్రసిద్ధి దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో దుర్గామాత భక్తులతో పూజలను అందుకుంటుంది. ప్రతి సంవత్సరం పొంగల్ సందర్భంగా ఇక్కడ నారీ పూజ నిర్వహిస్తారు. ఇది 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ కాలంలో పురుషులు ఇక్కడికి రావడం పూర్తిగా నిషేధం. పూజ చివరి రోజు సందర్భంగా మగ పూజారులు మహిళల పాదాలు కడుగుతారు. పొంగల్ సందర్భంగా 15 రోజుల ముందుగానే ఈ ఆలయంలో మహిళల రద్దీ కనిపిస్తుంది. మహిళలు తమ వెంట బియ్యం, బెల్లం, కొబ్బరికాయలు తీసుకువస్తారు. దుర్గాదేవికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని మహిళల ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం ప్రస్తావన హిందూ పురాణాలలో కూడా ఉంది.