AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taurus Horoscope 2024: ఈ రాశి వారికి కొత్త ఏడాది ఆర్ధికంగా లాభాలను ఇస్తే.. కుటుంబ పరంగా కష్టాలే.. నివారణ చర్యలు ఏమిటంటే

2024 నూతన సంవత్సరంలో ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆహారాన్ని తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే.. వ్యాయామ దినచర్యను అనుసరిస్తే.. శారీరక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతే కాదు ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ ప్రియమైనవారు, కుటుంబ సభ్యులు ఆరోగ్యంతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒత్తిడికి, ఆందోళనకు గురి చేస్తుంది.

Taurus Horoscope 2024: ఈ రాశి వారికి కొత్త ఏడాది ఆర్ధికంగా లాభాలను ఇస్తే.. కుటుంబ పరంగా కష్టాలే.. నివారణ చర్యలు ఏమిటంటే
Taurus Horoscope 2024
Surya Kala
|

Updated on: Dec 23, 2023 | 11:04 AM

Share

మరికొన్ని రోజుల్లో 2023కి వీడ్కోలు చెప్పి.. కొత్త సంవత్సరం 2024 కి స్వాగతం చెప్పనున్నాం.. అయితే ప్రతి ఒక్కరూ కొత్త ఏడాదిని ప్రారంభించాలనుకుంటారు. అంతేకాదు రానున్న ఏడాది తమ జీవితంలో సుఖ సంతోషలతో నిండిపోవాలని ఆశిస్తారు. ముఖ్యంగా  కొత్త సంవత్సరంలో తమ కెరీర్, ఆరోగ్యం, ప్రేమ జీవితం  ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని భావిస్తారు. ఈ నేపథ్యంలో 2024 వృషభ రాశికి వారికీ ఎలా ఉండనుందో ఈ రోజు తెలుసుకుందాం..

వృషభ రాశి 2024 లో కెరీర్, విద్య , డబ్బు అంచనాలు

నూతన సంవత్సరం 2024లో వృషభ రాశికి చెందిన వారికి కొన్ని మంచి అవకాశాలను అందిస్తుంది.  ముఖ్యంగా కెరీర్ లో ఉన్నతిని కోరుకునేవారికి వారి కెరీర్ మార్గాన్ని ప్రభావితం చేసే సానుకూల శక్తి కలుగుతుంది. వృత్తిలో ముందుకు సాగుతూ ఆర్ధికంగా లాభపడతారు. వ్యాపారవేత్తలు తమ వ్యూహాలతో సక్సెస్ అందుకుని లాభాలు పొందుతారు.

బుధుడు, శుక్రుడు శుభ దృష్టితో ఈ రాశికి చెందిన వారి ఆర్ధిక పరిస్థితిని ప్రభావితం అవుతుంది. అంతేకాదు సానుకూలత చాలా వేగంగా పెరుగుతుంది. వృషభరాశి  వ్యక్తులకు 2024 ఆర్థిక విషయాల పట్ల శుభవార్త వింటారు. వ్యాపార రంగాల్లో పెట్టిన పెట్టుబడి,  పొదుపు వ్యూహాలు ఫలవంతమైన ఫలితాలను ఇస్తాయి.

ఇవి కూడా చదవండి

ఈ సంవత్సరం ఉద్యోగులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. కొత్త అవకాశాలు వారి కెరీర్‌లో పురోగతిని కలిగిస్తాయి. కొత్త మైలురాళ్లను సాధించడంలో సహాయపడతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు 2024 చివరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్టూడెంట్స్ తమ లక్ష్యాలను సాధించడం కోసం పడే కష్టంలో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది.

వృషభ రాశి 2024: సంబంధం, ప్రేమ, కుటుంబ అంచనాలు

వృషభరాశిలో జన్మించిన వారు ప్రేమ విషయంలో విబేధాలు ఏర్పడవచ్చు. సవాళ్లను ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో ఆటంకాలు ఏర్పడి.. నిరాశ కలిగించవచ్చు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో బాధ కలిగించవచ్చు.

సంవత్సరం ప్రారంభంలో భార్య, భర్తల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. మార్చి 2024లో సంబంధాన్ని మెరుగుపరుచుకుని బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. కనుక విషయాలు మీకు అనుకూలంగా మారడం ప్రారంభిస్తాయి.

శుక్రుడు ఈ రాశికి చెందిన జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాడు. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తమ వారిని వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవాలి. జీవిత భాగస్వామి తినే ఆహారం, ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తగా ఉండాలి.

2024 నూతన సంవత్సరంలో ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆహారాన్ని తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే.. వ్యాయామ దినచర్యను అనుసరిస్తే.. శారీరక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతే కాదు ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ ప్రియమైనవారు, కుటుంబ సభ్యులు ఆరోగ్యంతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒత్తిడికి, ఆందోళనకు గురి చేస్తుంది.

జీవితం ఎదురయ్యే సవాళ్లను నివారించాలనుకుంటే.. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య క్షేత్రాలను  సందర్శించడం ద్వారా 2024 నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలని జ్యోతిష్యులు సూచించారు. ఇలా చేయడం సానుకూలతను ఆకర్షించడంలో సహాయపడుతుంది. ప్రియమైనవారితో కొంత సమయం గడిపే అవకాశం ఇస్తుంది. అంతేకాదు ఇలా పుణ్యక్షేత్రాల సందర్శనం ఆరోగ్యంతో పాటు దైవం ఆశీర్వదం  పొందడంలో సహాయపడుతుంది. అంతేకాదు జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతను దూరం చేస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!