Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moon Horoscope: అనుకూల స్థితిలో చంద్రుడు.. ఆ రాశుల వారు కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూల సమయం..!

ఇప్పటి నుంచి ఈ నెలాఖరు వరకు చంద్రుడు ఏడు రాశులవారికి శుభ ఫలితాలనివ్వబోతు న్నాడు. కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకోదలచుకున్నవారికి, కొత్త ప్రయత్నాలు చేపట్టదలచుకున్నవారికి, జీవనశైలి మార్చుకోదలచుకున్నవారికి ఇది చాలా మంచి సమయం. చంద్రుడు మనఃకారకుడైనందువల్ల మనసులోని కోరికలు నెరవేరడం, వ్యక్తిగత సమస్యలు, మానసిక ఒత్తిళ్లు దూరమై, మనశ్శాంతి ఏర్పడడం వంటివి చంద్రుడి వల్లే సాధ్యమవుతాయి.

Moon Horoscope: అనుకూల స్థితిలో చంద్రుడు.. ఆ రాశుల వారు కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూల సమయం..!
Moon Astro
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 22, 2023 | 6:54 PM

ఇప్పటి నుంచి ఈ నెలాఖరు వరకు చంద్రుడు ఏడు రాశులవారికి శుభ ఫలితాలనివ్వబోతున్నాడు. కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకోదలచుకున్నవారికి, కొత్త ప్రయత్నాలు చేపట్టదలచుకున్నవారికి, జీవనశైలి మార్చుకోదలచుకున్నవారికి ఇది చాలా మంచి సమయం. చంద్రుడు మనఃకారకుడైనందువల్ల మనసులోని కోరికలు నెరవేరడం, వ్యక్తిగత సమస్యలు, మానసిక ఒత్తిళ్లు దూరమై, మనశ్శాంతి ఏర్పడడం వంటివి చంద్రుడి వల్లే సాధ్యమవుతాయి. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే చంద్రుడు అంత అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. తరచూ పరమేశ్వరుడిని కానీ, దుర్గామాతను గానీ ప్రార్థించడం వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. దత్తాత్రేయుడి స్తోత్రం చదువుకోవడం వల్ల కూడా మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఈ ఏడు రాశులుః మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకరం, మీనం.

  1. మేషం: ఈ నెల 30వ తేదీ వరకూ ఈ రాశివారికి చంద్రుడు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండబో తున్నాడు. తప్పకుండా మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. గృహ, వాహనాలకు సంబంధించిన కలలు నెరవేరే అవకాశం ఉంటుంది. తల్లితో అనుబంధం పెరుగుతుంది. తల్లి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. జీవితానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
  2. వృషభం: ఈ రాశివారు చంద్రుడి అనుకూలత వల్ల ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ప్రయత్నం చేసినా తప్ప కుండా నెరవేరే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మరింత మెరుగైన స్థితికి చేరుకోవడానికి, వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధించడానికి, శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. జీవితంలో సానుకూల మార్పులు వచ్చే సూచనలున్నాయి. వ్యక్తిగత సమస్యలే కాక, కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అయి మనశ్శాంతి ఏర్పడుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశినాథుడైన చంద్రుడు ఎంతగానో అనుకూలంగా ఉన్నందువల్ల తప్పకుండా వీరి మనసు లోని కోరికల్లో ముఖ్యమైనవి నెరవేరే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పడుతుంది. జీవితపరంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై, ఆత్మవిశ్వాసం, ధైర్యం ఇనుమడిస్తాయి. జీవనశైలి మారిపోతుంది.
  4. తుల: ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన ఆశలు,ఆశయాల్లో చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల, కొత్త కార్య క్రమాలు చేపట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రతి పనీ, ప్రతి వ్యవహారమూ గతం కంటే మెరుగ్గా ఉంటుంది. జీవితానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. నిలకడైన, స్థిరమైన ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తవింటారు.
  5. ధనుస్సు: ఈ రాశివారు కొత్త సంవత్సరానికి ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ప్రయత్నం చేసినా తప్పకుండా ఫలి స్తుంది. ఉద్యోగపరంగా, పెళ్లిపరంగా ప్రయత్నాలు ఫలించి, జీవితంలో స్థిరపడడం జరుగు తుంది. విదేశీ యానానికి అవకాశాలున్నాయి. విదేశాల్లో స్థిరపడడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయ వంతం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపో తాయి. ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలంగా మారుతాయి. ప్రతిదీ మీరనుకున్నట్టే జరుగుతుంది.
  6. మకరం: ఈ నెలాఖరు వరకు చంద్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ కొద్ది రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు కొత్త సంవత్సరంలో మీ జీవితాన్ని సానుకూల మలుపు తిప్పుతాయి. సొంత నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. మనసులోని కోరికలు అప్రయత్నంగా కూడా నెరవేరుతాయి. వైవాహిక జీవితం సుఖప్రదంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా డిమాండ్ పెరుగుతుంది.
  7. మీనం: ఈ రాశివారికి చంద్రుడు బాగా అనుకూలంగా ఉండబోతున్నందువల్ల కొత్త సంవత్సరంలో కొత్త జీవన శైలి అలవడుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడడమే కాకుండా, అనేక విధాలుగా సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాబల్యం పెరుగుతాయి. నిరుద్యో గులకే కాక, ఉద్యోగులకు సైతం ఉద్యోగావకాశాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగు పడుతుంది. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా కలిసి వస్తుంది.

విధులు ముగించుకొని వెళ్తున్న పోలీసులు.. దారిలో కనిపించింది చూసి..
విధులు ముగించుకొని వెళ్తున్న పోలీసులు.. దారిలో కనిపించింది చూసి..
చాట్జీపీటీతో జర భద్రం..ఏఐలతో మనసు విప్పితే బతుకు బస్టాండే
చాట్జీపీటీతో జర భద్రం..ఏఐలతో మనసు విప్పితే బతుకు బస్టాండే
ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
శ్రీసత్య ఓవర్‌ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
శ్రీసత్య ఓవర్‌ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌