Jupiter Transit 2024: వృషభ రాశిలోకి గురువు.. కొత్త సంవత్సరం మొదటి నుంచే ఆ రాశుల వారికి కనక వర్షం.. !

Gugu Gochar 2024: వచ్చే ఏడాది ఏప్రిల్ 24న గురువు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి మారడం జరుగుతోంది. ధన కారకుడైన గురువు వృషభ రాశిలోకి మారడం వల్ల తప్పకుండా అయిదు రాశుల వారికి ఆర్థికపరంగా విపరీత రాజయోగం పడుతుంది. వాస్తవానికి వచ్చే ఏడాది జనవరి నుంచే ఈ రాశుల వారి మీద గురువు కనక వర్షం కురిపించడం ప్రారంభం అవుతుందని చెప్పవచ్చు. అంటే, మేషరాశిలో ఉన్న కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో గురువు ప్రవేశించగానే..

Jupiter Transit 2024: వృషభ రాశిలోకి గురువు.. కొత్త సంవత్సరం మొదటి నుంచే ఆ రాశుల వారికి కనక వర్షం.. !
Jupiter Transit 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 23, 2023 | 12:02 PM

Guru Graha Gochar 2024: వచ్చే ఏడాది ఏప్రిల్ 24న గురువు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి మారడం జరుగుతోంది. ధన కారకుడైన గురువు వృషభ రాశిలోకి మారడం వల్ల తప్పకుండా అయిదు రాశుల వారికి ఆర్థికపరంగా విపరీత రాజయోగం పడుతుంది. వాస్తవానికి వచ్చే ఏడాది జనవరి నుంచే ఈ రాశుల వారి మీద గురువు కనక వర్షం కురిపించడం ప్రారంభం అవుతుందని చెప్పవచ్చు. అంటే, మేషరాశిలో ఉన్న కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో గురువు ప్రవేశించగానే ఈ రాశుల వారికి ధన సంబంధమైన యోగాలు పట్టడం ప్రారంభిస్తాయి. సాధారణంగా గురు గ్రహం ఏ రాశి నుంచయినా 2, 5, 7, 9, 11 రాశులలో సంచరిస్తున్నప్పుడు తప్పకుండా ధన యోగాలు పట్టించడం జరుగుతుంది. దాన్ని బట్టి ఈ ఏడాది మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి యోగాలు పట్టించబోతున్నాడు.

  1. మేషం: ఈ రాశికి గురువు ధన స్థానమైన వృషభ రాశిలో ప్రవేశించడం వల్ల ఆకస్మిక ధన లాభానికి, అప్రయత్న ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి ఇబ్బడి ముబ్బ డిగా పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. లాటరీలు, జూదాలు, ఆర్థిక లావాదేవీలు, షేర్లు వంటివి అంచనాలకు మించి కలిసి వస్తాయి. రాయల్టీలు, ఇన్సూరెన్సు, పెన్షన్ల ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది. దీర్ఘకా లిక రుణాలతో పాటు, స్వల్పకాలిక రుణాల సమస్యలు కూడా చాలావరకు పరిష్కారం అవుతాయి.
  2. కర్కాటకం: గురువు ఈ రాశికి కూడా శుభ గ్రహమే అయినందువల్ల, లాభ స్థానంలో సంచారం ప్రారంభిస్తు న్నందు వల్ల తప్పకుండా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా కలిసి రావడంతో పాటు, ముఖ్యంగా ఆర్థిక ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. జీతభత్యాలు, రాబడి, లాభాలు బాగా పెరుగు తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. తండ్రి నుంచి ఆస్తి కలిసి వస్తుంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
  3. కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో ప్రవేశిస్తున్న గురువు వల్ల ఏ రంగంలోని వారికైనా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆదాయం పెరుగుదలకు సంబంధించిన ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. బ్యాంకు బ్యాలెన్సు పెరుగుతుంది. వస్త్రాభరణాలు కొనగోలు చేయడం జరు గుతుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి, ఆదాయం కలిసి వస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. విదేశీ ధనం అనుభవించే సూచనలు కూడా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల మూలంగా రాబడి పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
  4. వృశ్చికం: ఈ రాశివారికి సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్న గురువు వల్ల వృత్తి, వ్యాపారాల పరంగా రాబడి బాగా పెరుగుతుంది. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. ప్రేమలు, పెళ్లిళ్ల కారణంగా కూడా ఆర్థిక లాభం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం సంపాదించడం, విదేశాల్లో వ్యాపా రాలు ప్రారంభించడం వంటివి జరగవచ్చు. జీవిత భాగస్వామికి కూడా వృత్తి, ఉద్యోగాల పరంగా ఆదాయం పెరుగుతుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు అమరే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అయి మనశ్శాంతి ఏర్పడుతుంది.
  5. మకరం: ఈ రాశివారికి పంచమ స్థానంలో గురు గ్రహ ప్రవేశం వల్ల చాలా వరకు ఆర్థిక సమస్యలు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభించి ప్రమోషన్ లేదా అధికారం దక్కే అవకాశం ఉంది. జీతభత్యాలు, రాబడి, అదనపు సంపాదన వంటివి ఆశించిన దానికంటే ఎక్కువగా పెరుగుతాయి. కుటుంబపరంగా కూడా ఆదాయం పెరుగుతుంది. ఆర్థికపరంగా స్థిరత్వం లభిస్తుంది. భారీ జీతభత్యాలతో కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది.

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?