Sabarimala: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 15 గం. సమయం.. ట్రాఫిక్‌ నియంత్రణపై దృష్టి..

హరిహర తనయుడు అయ్యప్పస్వామి కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. దీంతో అయ్యప్ప దర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. పంబ వరకు ఎటుచూసినా భక్త జనమే. 40 రోజుల్లో శబరిమలకు ఆదాయం 204 కోట్ల ఆదాయం సమకూరింది. కేరళ హైకోర్టు ఆదేశాల క్రమంలో ట్రాఫిక్‌ నియంత్రణపై పోలీసులు దృష్టిసారించారు.

Sabarimala: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 15 గం. సమయం.. ట్రాఫిక్‌ నియంత్రణపై దృష్టి..
Sabarimala Rush
Follow us
Surya Kala

|

Updated on: Dec 27, 2023 | 6:51 AM

శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలుగకుండా ఉండేందుకు అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయ్యప్ప దర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇప్పటి వరకు దాదాపు 32 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. 40 రోజుల్లో శబరిమలకు 204 కోట్ల ఆదాయం సమకూరింది. కానుకల రూపంలో 64 కోట్లు వచ్చినట్టు ట్రావెన్‌ కోర్‌ ప్రకటించింది. మరోవైపు వర్చువల్ క్యూ బుకింగ్‌ల సంఖ్య 90 వేలు దాటింది. స్పాట్ బుకింగ్‌లతో దాదాపు 10,000 మంది భక్తులు రావడంతో రానున్న రెండు రోజుల్లో లక్ష మందికి పైగా భక్తులు శబరిమలకు రానున్నారు. దీంతో పాటు దాదాపు 20 వేల మంది ఎలాంటి బుకింగ్ లేకుండానే శబరిమలకు చేరుకుంటున్నారు. అయ్యప్ప దర్శనానికి 15గంటలకు పైగా సమయం పడుతోంది.

మరోవైపు రద్దీ అంతకంతకూ పెరుగుతోంది.- పంబ వరకు దారులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున వస్తున్న భక్తులకు దర్శనం కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక అయిదు చోట్ల అయ్యప్ప భక్తుల వాహనాలను అడ్డుకుంటున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పాలా, పొన్‌కున్నం, ఏటుమనూరు, వైకోమ్, కంజిరిపల్లిలో వాహనాలను అడ్డుకుంటున్నట్టు వివరించింది. వాహనాలను అడ్డుకునే సమయంలో భక్తులకు సరిపడా ఆహారం, నీరు అందేలా చూడాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే పోలీసు ఉన్నతాధికారులు నేరుగా జోక్యం చేసుకోవాలని, జిల్లా యంత్రాంగం ఈ విషయంలో సక్రమంగా సమన్వయం చేసుకోవాలని సూచించింది.

కేరళ హైకోర్టు ఆదేశాల క్రమంలో ట్రాఫిక్‌ నియంత్రణపై పోలీసులు దృష్టిసారించారు. రద్దీ దృష్ట్యా వాహనాలను ఆపితే ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఆదిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డ్రోన్ల సహాయంతో ఎక్కడికక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు చేపడుతున్నారు పోలీసులు. రద్దీని క్రమబద్దీకరించేలా చర్యలను ముమ్మరం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా
ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా
5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..
5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్
16 ఫోర్లు, 11 సిక్సర్లు.. నువ్వు మనిషివా మానవ మృగానివా భయ్యా..
16 ఫోర్లు, 11 సిక్సర్లు.. నువ్వు మనిషివా మానవ మృగానివా భయ్యా..
కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!