Telangana: కుక్కపై ప్రేమని చాటుకున్న ఫ్యామిలీ.. సంప్రదాయ పద్దతిలో ఘనంగా శ్రీమంతం
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఆడ కుక్కను గత ఏడు సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నారు. ఆ కుక్కకు లక్కీ అని ముద్దుగా పేరు పెట్టి తమ కుటుంబంలో ఒకరిగా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు. లక్కీకి శ్రీమంత కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించారు. లక్కీ (కుక్క) కాళ్లకు పసుపు పూసి గాజులు వేసి తలపై పూలు పెట్టి, పండ్లను తీసుకొని వచ్చి కార్యక్రమం నిర్వహించారు.
కుక్క విశ్వాసానికి మారుపేరు కుక్క అంటే వారికి ప్రాణం. కుక్కను వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తారు. కుక్కను ఎంతో ఆత్మీయంగా చూసుకునే ఆ కుటుంబ సభ్యులు కుక్కకు శ్రీమంతం చేయాలని నిర్ణయించారు. గర్భిణీలకు ఎలా శ్రీ మంత కార్యక్రమాన్ని నిర్వహిస్తారో అలానే కుక్కకు కూడా శ్రీమంతం చేసి దానిపై వారి కున్న మమ్ముకారాన్ని చాటుకున్నారు. నేలకొండపల్లిలోని ఓ కుటుంబం.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఆడ కుక్కను గత ఏడు సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నారు. ఆ కుక్కకు లక్కీ అని ముద్దుగా పేరు పెట్టి తమ కుటుంబంలో ఒకరిగా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు. లక్కీకి శ్రీమంత కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించారు. లక్కీ (కుక్క) కాళ్లకు పసుపు పూసి గాజులు వేసి తలపై పూలు పెట్టి, పండ్లను తీసుకొని వచ్చి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకును సైతం తీసుకువచ్చి లక్కీకి తినిపించారు. కుక్కపై వారికున్న ప్రేమను చూసి పలువురు శ్రీమంత కార్యక్రమం పై చర్చించుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..