AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రామయ్య మీద భక్తితో రామమందిరం థీమ్‌లో చేసిన క్రిస్మస్ కేక్.. వీడియో నెట్టింట్లో వైరల్

ఇటీవల గుజరాత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి రామ మందిరానికి కానుకగా ఇచ్చేలా రామమందిర భావనలో వజ్రాల హారాన్ని తయారు చేసి వార్తల్లో నిలిచాడు. కొద్ది రోజుల క్రితమే ఓ భక్తుడు 108 అడుగుల పొడవాటి అగరుబత్తీని 45 రోజుల పాటు శ్రీరాముడికి కానుకగా సమర్పించి వార్తల్లో నిలిచింది. అదే విధంగా ఇక్కడ ఒక కేక్ ఆర్టిస్ట్ కూడా రామమందిరం కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని భావించి రామమందిరం నేపథ్యంతో క్రిస్మస్ కేక్‌ను తయారు చేసింది.

Viral Video: రామయ్య మీద భక్తితో రామమందిరం థీమ్‌లో చేసిన క్రిస్మస్ కేక్.. వీడియో నెట్టింట్లో వైరల్
Christmas Cake
Surya Kala
| Edited By: TV9 Telugu|

Updated on: Dec 28, 2023 | 5:47 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. క్రిస్మస్ లో కేకులు సందడి చేస్తాయి. కొందరు తమ ఇంట్లోనే రకరకాల కేక్‌లను సిద్ధం చేకుంటే.. మరి కొందరు తమకు కావాల్సిన కేకులను మార్కెట్‌లో కొనుగోలు చేశారు. అయితే ఈ ఏడాదికి చెందిన కేక్ ఆర్టిస్ట్ ఈ క్రిస్మస్ సందర్భంగా రామమందిరం థీమ్‌తో స్పెషల్ కేక్‌ను తయారు చేయడంతో ఇప్పుడు సర్వత్రా వార్తల్లో నిలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

అయోధ్యలో అద్భుతంగా నిర్మిస్తున్న రామమందిర ప్రారంభోత్సవానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ చారిత్రక ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 22 న రామమందిరం, ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. దీంతో రామాలయ ప్రతిష్ఠనోత్సవానికి భక్తులు ఏదోక రూపంలో ఉడుత సేవని అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రామమందిరానికి తమ ఉత్తమ సహకారాన్ని అందిస్తున్నారు. ఇటీవల గుజరాత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి రామ మందిరానికి కానుకగా ఇచ్చేలా రామమందిర భావనలో వజ్రాల హారాన్ని తయారు చేసి వార్తల్లో నిలిచాడు. కొద్ది రోజుల క్రితమే ఓ భక్తుడు 108 అడుగుల పొడవాటి అగరుబత్తీని 45 రోజుల పాటు శ్రీరాముడికి కానుకగా సమర్పించి వార్తల్లో నిలిచింది. అదే విధంగా ఇక్కడ ఒక కేక్ ఆర్టిస్ట్ కూడా రామమందిరం కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని భావించి రామమందిరం నేపథ్యంతో క్రిస్మస్ కేక్‌ను తయారు చేసింది. ఇప్పుడు ఈ వార్త సర్వత్రా వైరల్‌గా మారింది.

పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చెందిన ప్రియాంక అనే కేక్ ఆర్టిస్ట్ రామమందిర్ నేపథ్య కేక్‌ని అద్భుతంగా తయారు చేసింది. జనవరి 22న రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. తాను కేక్ ఆర్టిస్ట్‌ని కనుక రామాలయ ప్రారంభోత్సవానికి కానుకగా ఏదైనా చేయాలనుకున్నాను.. అందుకే రామమందిరం నేపథ్యంతో కూడిన కేక్‌ను తయారు చేసింది’ అని ప్రియాంక వార్తా సంస్థ ANIతో అన్నారు.

ఈ వీడియో డిసెంబర్ 24న X ఖాతాలో షేర్ చేయబడింది. ఈ వీడియోకి 4.11 వేల వ్యూస్ ని సొంతం చేసుకుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..