AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అనర్గళంగా 7 భాషలు మాట్లాడుతున్న చిన్నారి.. ప్రతిభకు ఫిదా అవ్వాల్సిందే అందరూ

అతి కొద్దిమంది మాత్రమే అంటే మన మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు లాంటి వారు మాత్రమే ప్రపంచంలో 10-15 భాషలు తెలిసి మాట్లాడే వారున్నారు. ఇది అంత సులభం కానప్పటికీ.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్న కొన్ని భాషలను నేర్చుకోవడానికి కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే భిన్నమైన నేపథ్యం నుంచి వచ్చి ఉంటారు కనుక. అయితే ఎక్కువ భాషలు తెలుసున్న చిన్నారి ఉందని మీకు తెలుసా..

Viral Video: అనర్గళంగా 7 భాషలు మాట్లాడుతున్న చిన్నారి.. ప్రతిభకు ఫిదా అవ్వాల్సిందే అందరూ
Amazing Kid
Surya Kala
|

Updated on: Dec 25, 2023 | 1:12 PM

Share

ప్రపంచంలో అనేక దేశాలు.. అనేక సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనం.. అంతేకాదు రకరకాల భాషలు మాట్లాడతారు. ప్రస్తుతం ప్రపంచం ఏకమవుతున్న వేళ తమ సొంత భాషతో పాటు ఇతర భాషలను కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీంతో కొందరికి రెండు మూడు భాషలు తెలిస్తే.. మరికొందరు నాలుగు భాషలు మాట్లాడేవారున్నారు. అయితే అతి కొద్దిమంది మాత్రమే అంటే మన మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు లాంటి వారు మాత్రమే ప్రపంచంలో 10-15 భాషలు తెలిసి మాట్లాడే వారున్నారు. ఇది అంత సులభం కానప్పటికీ.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్న కొన్ని భాషలను నేర్చుకోవడానికి కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే భిన్నమైన నేపథ్యం నుంచి వచ్చి ఉంటారు కనుక. అయితే ఎక్కువ భాషలు తెలుసున్న చిన్నారి ఉందని మీకు తెలుసా.. చాలా చిన్న వయస్సులో అంటే 4-5 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికకు మొత్తం ఏడు భాషలు తెలుసట. ప్రస్తుతం అలాంటి ఒక అమ్మాయికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసి ఆశ్చర్యపోతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక చిన్న అమ్మాయి ఈ వయస్సులోనే తనకు రకరకాల భాషలపై అవగాహన ఉందని చెప్పకనే చెబుతుంది. దానికి రుజువు కూడా చూపుతుంది. అమ్మాయి తనకు రష్యన్, ఇంగ్లీష్, అరబిక్, ఇటాలియన్, స్పానిష్, జర్మన్, చైనీస్ తెలుసునని చెబుతుంది. అమ్మాయి అన్ని భాషలను ఒక్కొక్కటిగా ఎలా మాట్లాడుతుందో వీడియోలో చూడవచ్చు. ఆమె జర్మన్‌తో ప్రారంభించి, అరబిక్, స్పానిష్, చైనీస్‌తో సహా అన్ని భాషలను మాట్లాడటం ద్వారా అందరినీ మంత్రముగ్దులను చేస్తుంది. ఈ వీడియో లిటిల్ బిగ్ షాట్స్ అనే టీవీ షో నుండి వచ్చింది. దీనిలో ప్రపంచం నలుమూలల నుండి ప్రతిభావంతులైన పిల్లలు ఆహ్వానించబడ్డారు. ఆ చిన్నారులు అద్భుతమైన ప్రతిభను ప్రేక్షకుల ముందు ప్రదర్శించారు.

ఇవి కూడా చదవండి

అద్భుతమైన పిల్ల!

ఈ వీడియో @ThebestFigen అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 58 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 9 లక్షల మందికి పైగా వీక్షించగా, వేలాది మంది లైక్ చేశారు.

అదే సమయంలో వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాల ప్రతిచర్యలను కూడా ఇచ్చారు. ‘ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయిని నేనెప్పుడూ చూడలేదు’ అని ఒకరు అంటే, ‘అమ్మాయి ఇంత చిన్న వయసులో ఇన్ని భాషలు నేర్చుకుంది, అద్భుతం’ అని మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..