AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: చేపల కోసం వేసిన వల బరువెక్కింది.. దాన్ని పైకి లాగి చూడగా..!

క్రిస్మస్‌ శుభవేళ మత్స్యకారుల పంట పండింది. సముద్రంలో వల వేస్తే.. వాళ్లు అనుకున్నదాని కంటే.. భారీ చేప చిక్కింది. దీంతో మత్స్యకారుల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో చోటు చేసుకుంది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

AP News: చేపల కోసం వేసిన వల బరువెక్కింది.. దాన్ని పైకి లాగి చూడగా..!
Fishing Net
Ravi Kiran
|

Updated on: Dec 25, 2023 | 1:04 PM

Share

క్రిస్మస్‌ శుభవేళ మత్స్యకారుల పంట పండింది. సముద్రంలో వల వేస్తే.. వాళ్లు అనుకున్నదాని కంటే.. భారీ చేప చిక్కింది. దీంతో మత్స్యకారుల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో చోటు చేసుకుంది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు భారీ కొమ్ము కోణం చేపలు చిక్కుతున్నాయి. ఒక్కో చేప ఏకంగా 200 నుంచి 400 కిలోల బరువు ఉండడంతో క్రేన్‌ సహాయంతో కుంభాభిషేకం రేవు వద్దకు తరలించారు. ఎప్పటిలాగే సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులకు అదృష్టం పట్టింది. వలలో భారీ కొమ్ముకోణం చేపలు చిక్కడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఒక్క చేప 450 కేజీల బరువు తూగుతోంది. దాంతో ఈ భారీ చేపలను బోట్లలో ఒడ్డుకుతేవడం సాధ్యపడకపోవడంతో వాటిని తీరానికి చేర్చడానికి మత్స్యకారులు క్రేన్‌ సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఇటీవల కాలంలో ఇంత పెద్ద చేపలు, పెద్దమొత్తంలో పడలేదని మత్స్యకారులు చెబుతున్నారు. కాగా ఈ కొమ్ముకోణం చేపలను కొనేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. కుంభాభిషేకం రేవులో వేలం నిర్వహించగా 430 కేజీల బరువైన చేపను ఆకుల శ్రీనివాస్‌ అనే స్థానిక వ్యాపారి 36 వేల రూపాయలకు కొనుగోలు చేశాడు.

2025లోనే పరమ చెత్త సినిమాగా రికార్డ్..
2025లోనే పరమ చెత్త సినిమాగా రికార్డ్..
వాంఖడే సాక్షిగా చరిత్ర సృష్టించిన సూర్య..కోహ్లీ రికార్డ్ బ్రేక్
వాంఖడే సాక్షిగా చరిత్ర సృష్టించిన సూర్య..కోహ్లీ రికార్డ్ బ్రేక్
మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!