Viral News: యజమాని టార్చర్ తట్టుకోలేక ఉద్యోగం మానేసిన మహిళ.. ప్రతీకారం ఎలా తీర్చుకుందంటే..

ఒక మహిళా ఉద్యోగి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తర్వాత.. తన యజమాని తీరుపై గుర్రుగా ఉంది. అంతేకాదు ప్రతీకారం తీర్చుకుంది. బహుశా యజమాని ఆ ప్రతీకారాన్ని జీవితాంతం మరచిపోలేడు. అయితే ఆ మహిళ తన ప్రతీకారాన్ని తప్పు అని అంటూనే.. అపరిపక్వంగా అభివర్ణించింది. అదే సమయంలో తాను తీర్చుకున్న ప్రతీకారం గురించి ఆందోళన చెందినట్లు చెప్పింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మహిళ ఉద్యోగి మొత్తం సంఘటన గురించి సోషల్ మీడియాలో చెప్పడం.. ప్రస్తుతం ఆ స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది.

Viral News: యజమాని టార్చర్ తట్టుకోలేక ఉద్యోగం మానేసిన మహిళ.. ప్రతీకారం ఎలా తీర్చుకుందంటే..
Viral News
Follow us

|

Updated on: Dec 21, 2023 | 3:32 PM

లోకంలో కొంత మంది తమ కోరిక మేరకు ఉద్యోగాలు పొందుతున్నారు. అక్కడ జీతం బాగానే ఉంటుంది. అన్ని రకాల సౌకర్యాలు కూడా లభిస్తాయి. అదే సమయంలో ఉద్యోగులకు మంచి జీతాలు వచ్చినా తమ  జీవితాల్లో ప్రశాంతత ఉండనివ్వడం లేదంటూ కొన్ని సంస్థల ఉద్యోగులు వాపోతూ ఉంటారు. అధిక పని కారణంగా ఉద్యోగస్తులు తరచుగా తన యజమాని తీరూపుఁ నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు.  ఒకొక్కసారి కొందరు తమ పై వారి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు కూడా. సాధారణంగా అటువంటి పరిస్థితిలో, ఉద్యోగులు ఉద్యోగాన్ని వదిలివేస్తారు అయితే కొంతమంది తమ బాస్ పై  ప్రతీకారం తీర్చుకోవాలని కూడా ఆలోచిస్తారు. అలాంటి ఒక విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అంతేకాదు ప్రజలను ఆలోచించేలా చేస్తుంది కూడా..

వాస్తవానికి ఒక మహిళా ఉద్యోగి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తర్వాత.. తన యజమాని తీరుపై గుర్రుగా ఉంది. అంతేకాదు ప్రతీకారం తీర్చుకుంది. బహుశా యజమాని ఆ ప్రతీకారాన్ని జీవితాంతం మరచిపోలేడు. అయితే ఆ మహిళ తన ప్రతీకారాన్ని తప్పు అని అంటూనే.. అపరిపక్వంగా అభివర్ణించింది. అదే సమయంలో తాను తీర్చుకున్న ప్రతీకారం గురించి ఆందోళన చెందినట్లు చెప్పింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మహిళ ఉద్యోగి మొత్తం సంఘటన గురించి సోషల్ మీడియాలో చెప్పడం.. ప్రస్తుతం ఆ స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. మొదట ఉద్యోగం మానేసి ఆ తర్వాత కంపెనీ డేటాబేస్ పాస్‌వర్డ్‌ను మార్చినట్లు మహిళ చెప్పింది. అటువంటి పరిస్థితిలో మహిళ చేసింది తప్పా లేదా అనే చర్చ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

పోస్ట్ చూడండి

View this post on Instagram

A post shared by Reddit (@reddit)

సోషల్ మీడియా సైట్ రెడ్డిట్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్క్రీన్‌షాట్‌ను పంచుకుంది. అందులో తన యజమాని..  అతని బృందం తన పట్ల ప్రవర్తన అస్సలు బాగోలేదని.. అయితే తనకు ఉద్యోగం అవసరం కనుక అన్నింటిని తట్టుకుని చాలా కాలం పనిచేసినట్లు పేర్కొంది. ఒక రోజు తాను ఉద్యోగం వదిలివేయాలని నిర్ణయించుకున్నానని మరుసటి రోజు నుండి ఉద్యోగానికి వెళ్లడం మానేసింది. తరువాత సంస్థ నుండి అనేక  కాల్స్ అందుకుంది. అయితే ఆమె ఫోన్ కాల్స్ ను లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత ఒకరోజు తన ఐడీని చెక్ చేయగా.. కంపెనీ తన ఖాతాను మూసివేయలేదని తెలుసుకుంది. అప్పుడు తన మేనేజర్ మీద ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన.. అవకాశం వచ్చింది.

ఆ మహిళ వెంటనే ఖాతా పాస్‌వర్డ్‌ను మార్చేసింది. ఆ ఖాతాలో కంపెనీకి సంబంధించిన అన్ని ముఖ్యమైన సమాచారం ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఆ మహిళకు తెలియకపోయినప్పటికీ సోషల్ మీడియాలో జరిగిన విషయం అంతా తెలుసుకుని కొందరు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కొందరు స్త్రీని నిందించగా, మరికొందరు ఆమె ఏమి చేసినా .. మంచి రివెంజ్ అని అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే