AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vatican City: ప్రపంచంలోని అతి చిన్న దేశం..40 ని.ల్లోనే చుట్టెయ్యవచ్చు.. క్రిస్మస్ వేడుకలు వెరీ వేరే స్పెషల్

ఐరోపా ఖండంలో ఉన్న వాటికన్ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఈ దేశం వైశాల్యం కేవలం 44 హెక్టార్లు అంటే దాదాపు 108 ఎకరాలు. ఈ దేశంలో నివసించాలనేది ప్రపంచంలో అనేక మంది కల. వాటికన్ సిటీ కంటే ఇటలీ రాజధాని రోమ్‌లో ఉన్న జనాభా 1000 మంది తక్కువ. రోమ్ నగరంలో ఉన్న ఈ దేశ భాష లాటిన్. ఈ దేశం స్పెషాలిటీ ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.. 

Vatican City: ప్రపంచంలోని అతి చిన్న దేశం..40 ని.ల్లోనే చుట్టెయ్యవచ్చు.. క్రిస్మస్ వేడుకలు వెరీ వేరే స్పెషల్
Vatican City
Surya Kala
|

Updated on: Dec 24, 2023 | 2:05 PM

Share

ఇప్పటి వరకు మీరు ప్రపంచంలోని అనేక చిన్న లేదా పెద్ద దేశాల గురించి విని ఉండవచ్చు లేదా చూసి ఉండవచ్చు. ఇలా ఏ దేశంలోనైనా ప్రదేశాలను సందర్శించాలంటే రోజులకు రోజులు పడతాయి. అయితే మీరు కేవలం 30 నుండి 40 నిమిషాల్లో సందర్శించగలిగే ప్రపంచంలోని అతి చిన్న దేశం గురించి మీకు తెలుసా? అవును.. కేవలం అరగంటలో సందర్శించగలిగే దేశం భూమిపై ఉందని తెలిస్తే ఎవరైనా సరే  ఆశ్చర్యపోతారు. ఆ దేశం వాటికన్ సిటీ.

ఐరోపా ఖండంలో ఉన్న వాటికన్ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఈ దేశం వైశాల్యం కేవలం 44 హెక్టార్లు అంటే దాదాపు 108 ఎకరాలు. ఈ దేశంలో నివసించాలనేది ప్రపంచంలో అనేక మంది కల. వాటికన్ సిటీ కంటే ఇటలీ రాజధాని రోమ్‌లో ఉన్న జనాభా 1000 మంది తక్కువ. రోమ్ నగరంలో ఉన్న ఈ దేశ భాష లాటిన్. ఈ దేశం స్పెషాలిటీ ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

క్రైస్తవ విశ్వాసానికి కేంద్రం

వాటికన్ సిటీలో కాథలిక్ క్రిస్టియన్ కమ్యూనిటీ ప్రజల మతపరమైన, సాంస్కృతిక గమ్యస్థానం. ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాథలిక్ చర్చి నాయకుడైన పోప్ కు నిలయం. ఇక్కడ వీధుల్లో తిరుగుతూ ఎవరైనా సరే ఒక ప్రత్యేక రకమైన శాంతిని అనుభవించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఏఏ ప్రదేశాలను సందర్శించవచ్చంటే

వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికాను కూడా సందర్శించవచ్చు. దీనిని ఇటాలియన్ భాషలో వాటికన్‌లో బాసిలికా డి శాన్ పియట్రో అని పిలుస్తారు. కాథలిక్ సంప్రదాయం ప్రకారం ఈ పెద్ద చర్చి సెయింట్ పీటర్‌ను ఖననం చేసిన ప్రదేశంగా పరిగణించబడుతుంది. అతను ఏసు 12 మంది శిష్యుల్లో ఒకడు. సెయింట్ పీటర్స్ బసిలికా సముదాయంలో సుమారు 100 సమాధులు ఉన్నాయి. ఈ ప్రదేశం ముఖ్యంగా తీర్థయాత్రగా ప్రసిద్ధి చెందింది. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు ఈ నగరంలో సందర్శనం మంచి జ్ఞాపకాన్ని ఇస్తుంది.

అందమైన క్రిస్మస్ దృశ్యం

ఇక్కడి దృశ్యం క్రిస్మస్ సందర్భంగా చూడదగ్గ దృశ్యం. వాటికన్ సిటీకి ఉన్న మతపరమైన ప్రాముఖ్యత కారణంగా క్రిస్మస్ సందర్భంగా ప్రజలు భారీగా చేరుకుంటారు. క్రిస్మస్ పండుగను చూసేందుకు ఇతర దేశాల నుంచి కూడా ఈ నగరానికి వస్తుంటారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..