Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fit for work: ఉద్యోగస్తుల ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టిన కంపెనీ.. ఎంత పరిగెడితే అంత బోనస్ అని ప్రకటన..

రోజూ పరుగెత్తడం వల్ల ఎముకలు, కండరాలు బలపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు బరువు తగ్గించడంతో పాటు.. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా పరుగు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే రన్నింగ్  చేయడం వలన శారీరక ప్రయోజనాలు మాత్రమే కాదు.. ఆఫీసులో కూడా లభిస్తాయని మీరు ఎప్పుడైనా విన్నారా? అవును చైనాలోని ఒక కంపెనీ తన ఉద్యోగులకు వింత ఆఫర్ ఇచ్చింది. అయితే కంపెనీ ఇచ్చిన ఆఫర్ తో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు.. ప్రజల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి కూడా..   

Fit for work: ఉద్యోగస్తుల ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టిన కంపెనీ.. ఎంత పరిగెడితే అంత బోనస్ అని ప్రకటన..
Employees Are Healthy
Follow us
Surya Kala

|

Updated on: Dec 18, 2023 | 3:55 PM

ఆరోగ్యంగా ఉండడం కోసం యోగ, వ్యాయామం తప్పని సరి. వ్యాయామంలో భాగంగా చేసే వాకింగ్, రన్నింగ్ లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పరుగు వలన శారీరక ప్రయోజనాలు మాత్రమే కాదు..  మానసిక ప్రయోజనాలు కూడా ఉంటుంది. రోజూ పరుగెత్తడం వల్ల ఎముకలు, కండరాలు బలపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు బరువు తగ్గించడంతో పాటు.. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా పరుగు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే రన్నింగ్  చేయడం వలన శారీరక ప్రయోజనాలు మాత్రమే కాదు.. ఆఫీసులో కూడా లభిస్తాయని మీరు ఎప్పుడైనా విన్నారా? అవును చైనాలోని ఒక కంపెనీ తన ఉద్యోగులకు వింత ఆఫర్ ఇచ్చింది. అయితే కంపెనీ ఇచ్చిన ఆఫర్ తో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు.. ప్రజల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి కూడా..

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న డాంగ్‌పో పేపర్ కంపెనీ ఇటీవల తన ఉద్యోగులకు బోనస్ సిస్టమ్ ని తీసుకుని వచ్చింది. అయితే ఈ బోనస్ సిస్టమ్‌ అందుకోవాలంటే ఉద్యోగులకు కండిషన్ కూడా పెట్టింది. అది ఏమిటంటే ఉద్యోగులు చేసే వ్యాయామంపై ఆధారపడి బోనస్ లభిస్తుంది. అంటే ఉద్యోగులు ఎంత ఎక్కువ వ్యాయామం చేస్తే.. వారు ఆంత బోనస్ ను పొందుతారు. కంపెనీ యాజమాన్యం పెట్టిన రూల్స్ ప్రకారం ఉద్యోగి ప్రతి నెలా 50 కిలోమీటర్లు పరిగెత్తితే.. అతనికి పూర్తి నెలవారీ బోనస్ లభిస్తుంది. అయితే ఉద్యోగి 40 కిమీ పరిగెత్తితే అతనికి 60 శాతం బోనస్, 30 కిమీ పరిగెత్తితే అతనికి 30 శాతం మాత్రమే బోనస్ లభిస్తుంది. అదే సమయంలో ఏ ఉద్యోగి అయినా ప్రతి నెలా 100 కి.మీ పరిగెత్తినట్లయితే.. కంపెనీ ప్రకటించిన బోనస్ మాత్రమే కాదు 30 శాతం ఎక్కువ బోనస్ లభిస్తుంది.

కంపెనీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే..?

ప్రతి ఉద్యోగి ప్రతిరోజూఎన్ని కిలోమీటర్లు పరిగెడుతున్నారో కంపెనీకి ఎలా తెలుస్తుంది అని ఎవరైనా ఆలోచిస్తే.. దానికి కూడా కంపెనీ సిబ్బంది ఒక సొల్యూషన్ ఏర్పాటు చేసుకుంది. తమ కంపెనీ ఉద్యోగుల ఫోన్‌లలో ఉన్న యాప్‌ల ద్వారా తెలుసుకుంటుంది. దీని ఆధారంగా బోనస్ ఇస్తారు. తమ ఉద్యోగులను ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహించడమే తమ లక్ష్యమని కంపెనీ చెబుతోంది. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే కంపెనీ ఎక్కువ కాలం మనుగడ సాగిస్తుందని కంపెనీ బాస్ లిన్ జియాంగ్ చెప్పారు. అందుకే కంపెనీ ఈ విశిష్ట నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

కంపెనీ అధికారిక WeChat ఖాతా ప్రకారం లిన్ స్వయంగా ఫిట్‌నెస్‌పై చాలా శ్రద్ధ చూపిస్తారు. అంతేకాదు  అతను ఇప్పటికే రెండుసార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. కంపెనీ బోనస్ కోసం పెట్టిన ఈ కొత్త రూల్ ఇపుడు చైనా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..