Viral News: ప్రపంచంలో ఫస్ట్ కేసు ఇదే.. తుమ్మే సమయంలో పొరపాటున ఇలా చేశారో.. ఇతనికి పడిన శిక్షే మీకు
తుమ్మును ఆపడం ఎంత ప్రాణాంతకం అవుతుందో ఇటీవల ప్రచురించిన కేస్ స్టడీ నివేదిక ద్వారా అంచనా వేయవచ్చు. బ్రిటన్‌లో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావిస్తూ.. వ్యక్తి తుమ్మును ఆపడానికి ప్రయత్నించడంతో శ్వాసనాళానికి ఎలా రంధ్రం పడిందో పేర్కొన్నారు. ఆ వ్యక్తి దాదాపు మరణం అంచుల వరకూ వెళ్లి వచ్చాడు. ఇలాంటి కేసు ప్రపంచంలోనే మొట్టమొదటిది అని అంటున్నారు.
తుమ్ముల విషయంలో అనేక మూఢ నమ్మకాలున్నాయి. ఎక్కువ మంది జనం మధ్య తుమ్మలన్నా.. లేదా తుమ్మే విషయంలో ఉన్న నమ్మకం వలన అయితే నేమి ఎక్కువమంది తుమ్ము వస్తుందంటే చాలు ఆపుకోవడానికి లేదా ముక్కుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే మీరు కూడా ఇలాంటి పని చేయాలనుకుంటే అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే తుమ్మును ఆపడం ఎంత ప్రాణాంతకం అవుతుందో ఇటీవల ప్రచురించిన కేస్ స్టడీ నివేదిక ద్వారా అంచనా వేయవచ్చు. బ్రిటన్‌లో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావిస్తూ.. వ్యక్తి తుమ్మును ఆపడానికి ప్రయత్నించడంతో శ్వాసనాళానికి ఎలా రంధ్రం పడిందో పేర్కొన్నారు. ఆ వ్యక్తి దాదాపు మరణం అంచుల వరకూ వెళ్లి వచ్చాడు. ఇలాంటి కేసు ప్రపంచంలోనే మొట్టమొదటిది అని అంటున్నారు.
జర్నల్ BMJ నివేదిక ప్రకారం.. 34 ఏళ్ల వ్యక్తి కారు నడుపుతున్నప్పుడు తుమ్మును ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఈ సంఘటన జరిగింది. ముక్కును వేలితో నొక్కగానే నోటి లోపల విపరీతమైన ఒత్తిడి ఏర్పడింది. ఫలితంగా తుమ్మును ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతని గాలి పైపులో రెండు మిల్లీమీటర్ల రంధ్రం ఏర్పడింది.
నివేదిక ప్రకారం అతను తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి చేరుకున్నాడు. అప్పుడు మెడ బాగా వాచిపోయింది. కదలడానికి కూడా ఇబ్బంది ఏర్పడింది. వైద్యులు అతడిని పరీక్షించగా అతని గొంతులో తేడా తేడా కనిపించింది. అయితే ఆ వ్యక్తి తనకు శ్వాస తీసుకోవడం, మింగడం లేదా మాట్లాడడంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాడు.
ఆ వ్యక్తికి డస్ట్ అలర్జీ అని విచారణలో తేలింది. దీనితో పరిచయం ఏర్పడిన వెంటనే తుమ్ములు మొదలయ్యాయి. ఆ రోజు కూడా ఆ వ్యక్తి నిరంతరం వస్తున్న తుమ్ముల నుంచి తప్పించుకోవడానికి తన ముక్కును నొక్కాడు. దీని ఫలితం చాలా దారుణంగా ఉందని తేలింది. అయితే ఎలాంటి శస్త్ర చికిత్స చేయకుండానే రెండు రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచిన వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఐదు వారాల తర్వాత మనిషి గాయం పూర్తిగా నయమైంది.
ఇలా అస్సలు చేయవద్దు..
ఇతని విషయం వెలుగులోకి వచ్చిన తరువాత వైద్యులు ఎవరికైనా తమ్ములు వస్తుంటే.. ఆపడానికి ముక్కును పట్టుకుని ఆపుకునే ప్రయత్నం చేయవద్దంటూ సూచించారు. ఎందుకంటే ఇలా చేయడం వలన తీవ్రమైన పరిణామాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..