Japanese Town: ఈ నగరంలో నివసించడానికి వెళ్తే చాలు 5.80 లక్షల గిఫ్ట్.. కండిషన్స్ అప్లై..

జపాన్‌లోని వాకయామా ప్రావిన్స్‌లో ఉన్న కైనాన్ నగరంలో నిరంతరం జనాభా తగ్గిపోతోంది. శరవేగంగా నగరంలో జనాభా తగ్గిపోవడంతో ప్రభుత్వం ఆందోళన నెలకొంది. అటువంటి పరిస్థితిలో  ప్రభుత్వం ప్రజలను ఇక్కడకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు నగరానికి వచ్చే ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నగరంలో నివసించే వ్యక్తికీ ప్రభుత్వం 10 లక్షల యెన్లు అంటే మన దేశ కరెన్సీ లో దాదాపు ఐదు లక్షల 80 వేల రూపాయలు ఇస్తుంది.

Japanese Town: ఈ నగరంలో నివసించడానికి వెళ్తే చాలు 5.80 లక్షల గిఫ్ట్.. కండిషన్స్ అప్లై..
Japan Town
Follow us
Surya Kala

|

Updated on: Dec 10, 2023 | 11:18 AM

ప్రపంచం నలుమూలల్లో అనేక మంది ప్రజలున్నారు. వీరు తాము తమకు నచ్చిన ప్రదేశాల్లో జీవించాలని కోరుకుంటారు. అలా తాము జీవించాలని కలలు కనే అనేక ప్రదేశాలు భూమిపై ఉన్నాయి. అయితే అది అందరికీ సాధ్యం కాదు. వాస్తవానికి ఈ ప్రదేశాలు స్వర్గం కంటే తక్కువ కాదు. అదే సమయంలో అవి చాలా ఖరీదైనవిగా ఉండడంతో అక్కడ నివసించడం సామాన్యుడికి అందుబాటులో ఉండదు. ప్రపంచంలో చాలా అందమైన ప్రదేశాలు, ఖరీదైనవి కానప్పటికీ అక్కడ నివసించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అలాంటి ప్రదేశం ఒకటి జపాన్‌లో కూడా ఉంది. ఈ ప్రదేశం నిజానికి ఒక నగరం.. ఇక్కడ జనాభా చాలా వేగంగా తగ్గుతోంది. దీంతో ఈ నగరానికి వచ్చి స్థిరపడాలని ప్రభుత్వం ప్రజలను విజ్ఞప్తి చేస్తుంది. అంతేకాదు ఈ నగరంలో వచ్చి నివసించే వారికీ లక్షల రూపాయలను బహుమతిగా అందిస్తామని ప్రకటించి కూడా ..

వాస్తవానికి జపాన్‌లోని వాకయామా ప్రావిన్స్‌లో ఉన్న కైనాన్ నగరంలో నిరంతరం జనాభా తగ్గిపోతోంది. శరవేగంగా నగరంలో జనాభా తగ్గిపోవడంతో ప్రభుత్వం ఆందోళన నెలకొంది. అటువంటి పరిస్థితిలో  ప్రభుత్వం ప్రజలను ఇక్కడకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు నగరానికి వచ్చే ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నగరంలో నివసించే వ్యక్తికీ ప్రభుత్వం 10 లక్షల యెన్లు అంటే మన దేశ కరెన్సీ లో దాదాపు 5 లక్షల 80 వేల రూపాయలు ఇస్తుంది. ఇది మాత్రమే కాదు.. ఆ వ్యక్తితో పాటు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉంటే.. అతని కోసం ప్రత్యేకంగా 10 లక్షల యెన్లు ఇవ్వబడతాయి. అయితే దీనికి కూడా చిన్న కండిషన్ ఉంది. ఆ చిన్న షరతును నెరవేరిస్తేనే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది.

మీడియా కథనాల ప్రకారం ఎవరైనా ఈ నగరానికి వచ్చి స్థిరపడినప్పుడు మాత్రమే ఈ లక్షల రూపాయలు పొందగలడు. అంతేకాదు అతని పేరులో ‘సుజుకి’ అని ఉండాలని కండిషన్ పెట్టింది. ‘సుజుకి’ పేరును ఉపయోగించమని ప్రజలకు చెప్పడానికి కూడా ఓ కారణం ఉంది. జపాన్‌లో సుజుకి అనేది రెండవ అత్యంత సాధారణ ఇంటిపేరు. కైనాన్ నగరం ఈ ఇంటిపేరు జన్మస్థలం.

ఇవి కూడా చదవండి

రెండేళ్ల క్రితమే ప్రచారం మొదలు

నివేదికల ప్రకారం నగరానికి జనాభాతో నింపడానికి 2021 సంవత్సరంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  కైనాన్ నగరాన్ని తిరిగి జనాభాతో నింపడం ప్రారంభించారు. సుజుకి ఇంటి పేరుతో సుమారు 7 లక్షల 50 వేల మంది ప్రజలు టోక్యో, పొరుగు ప్రావిన్సులైన చిబా, సైతామా, కనగావాలో నివసిస్తున్నారని అంచనా వేశారు.  అయితే ప్రచారం ప్రారంభించి రెండేళ్లు గడిచినా సుజుకి ఇంటిపేరుతో ఒక్క వ్యక్తిని కూడా ఆకర్షించడంలో నగరం విఫలమైందని ది గార్డియన్ నివేదించింది.

నగరంలో నివసించడానికి డబ్బు ఎందుకు ఇస్తారంటే..

వాస్తవానికి జపాన్ అంతటా వివిధ ప్రావిన్సుల్లో నివాసితుల సంఖ్య నిరంతరం తగ్గుతోంది. 2022 సంవత్సరంలో జపాన్ పౌరుల జనాభా రికార్డు స్థాయిలో 125.4 మిలియన్ల నుండి కేవలం 8 లక్షలకు తగ్గింది. మరోవైపు ది గార్డియన్ నివేదిక ప్రకారం ఇక్కడ విదేశీయుల సంఖ్య రికార్డు స్థాయిలో సుమారు మూడు మిలియన్లు అంటే 30 లక్షలకు పెరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్ అంచనా ప్రకారం 2070 నాటికి జపాన్ జనాభా కేవలం 87 మిలియన్లకు అంటే 8.7 కోట్లకు తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ జనాభాను ఎలాగైనా పెంచేందుకు ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..