Year Ender 2023: ఆగని రక్త చరిత్ర.. హమాస్ మొదలు పెట్టిన విధ్వంసాన్ని 63 రోజులుగా కొనసాగిస్తున్న ఇజ్రాయెల్..

అక్టోబర్ 7 తెల్లవారుజామున హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఇజ్రాయెల్‌లోని అనేక నగరాల్లో 5000 కంటే ఎక్కువ రాకెట్లు ప్రయోగించింది. హమాస్ చేసిన దాడుల్లో ఇజ్రాయెల్‌లో దాదాపు 1400 మంది చనిపోయారు. ఈ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా ప్రతీకారం తీర్చుకోవడం మొదలు పెట్టింది. ఇజ్రాయెల్ గాజాలోని హమాస్ స్థానాలపై దాడి చేయడం మొదలు పెట్టింది. ఇజ్రాయెల్ చేసిన.. చేస్తున్న దాడిలో హమాస్ యోధులతో పాటు వేలాది మంది పాలస్తీనియన్లు కూడా మరణించారు.

Year Ender 2023: ఆగని రక్త చరిత్ర.. హమాస్ మొదలు పెట్టిన విధ్వంసాన్ని 63 రోజులుగా కొనసాగిస్తున్న ఇజ్రాయెల్..
Israel Hamas War
Follow us
Surya Kala

|

Updated on: Dec 10, 2023 | 11:54 AM

2023 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో 2023 ఏడాదికి గుడ్ బై చెప్పి.. 2024కి స్వాగతం చెప్పడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ ఏడాది ఎన్నో చేదు, తీపి జ్ఞాపకాలు మిగిలిపోతున్నాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన యుద్ధం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. అక్టోబర్ 7న మొదలైన ఈ యుద్ధం యావత్ ప్రపంచాన్ని రెండు ముక్కలు చేసింది. పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వగా  ముస్లిం, అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌ను ఖండించాయి. ఈ 63 రోజులు పాటుగా సాగుతున్న యుద్ధంలో విధ్వంసం మాత్రమే మిగులుతుంది.

అవును అక్టోబర్ 7 తెల్లవారుజామున హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఇజ్రాయెల్‌లోని అనేక నగరాల్లో 5000 కంటే ఎక్కువ రాకెట్లు ప్రయోగించింది. హమాస్ చేసిన దాడుల్లో ఇజ్రాయెల్‌లో దాదాపు 1400 మంది చనిపోయారు. ఈ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా ప్రతీకారం తీర్చుకోవడం మొదలు పెట్టింది. ఇజ్రాయెల్ గాజాలోని హమాస్ స్థానాలపై దాడి చేయడం మొదలు పెట్టింది. ఇజ్రాయెల్ చేసిన.. చేస్తున్న దాడిలో హమాస్ యోధులతో పాటు వేలాది మంది పాలస్తీనియన్లు కూడా మరణించారు.

గాజాలో ఇప్పటివరకు 17,000 మందికి పైగా మృతి

గాజాలో ఇప్పటివరకు 17,000 మందికి పైగా మరణించారు. అదే సమయంలో 46 వేల మందికి పైగా గాయపడినట్లు సమాచారం. హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ హమాస్‌ను పూర్తిగా నాశనం చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. హమాస్‌ను పూర్తిగా నాశనం చేసే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం మరింత ప్రమాదకరంగా దాడులు చేయడం మొదలు పెట్టింది.

ఇవి కూడా చదవండి

గాజాలో వేలాది హమాస్ రహస్య స్థావరాల ధ్వంసం

గాజాలోని హమాస్ స్థావరాలను ఎంపిక చేసి కూల్చివేయడం ప్రారంభించింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులతో డజన్ల కొద్దీ హమాస్ కమాండర్లు, వందల మంది యోధులు మరణించారు. క్రమంగా IDF గాజాలో భూమి మీద దాడులు చేయడం ద్వారా హమాస్ స్థానాలను నాశనం చేసింది. తాము చేసే దాడుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఇలా ఎవరైనా ఇజ్రాయెల్ సైన్యం లెక్క చేయలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 5000 మంది చిన్నారులు చనిపోయారు.

ప్రపంచం మొత్తం రెండు వర్గాలుగా విడిపోయింది

ఇజ్రాయెల్ దాడులతో భయబ్రాంతులకు గురైన లక్షలాది మంది పాలస్తీనియన్లు నగరం నుండి పారిపోయారు. ఇజ్రాయెల్ దాడిని ముస్లిం దేశాలు, అరబ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించి ప్రపంచం మొత్తం రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం ఇజ్రాయెల్‌ను బహిరంగంగా వ్యతిరేకించింది. అదే సమయంలో పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చాయి. యుద్ధం జరిగిన సుమారు ఒకటిన్నర నెలల తర్వాత.. అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో హమాస్.. ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

ఈ ఒప్పందం ప్రకారం హమాస్ 50 మంది బందీలను విడుదల చేయాలి.. అందుకు బదులుగా ఇజ్రాయెల్ 150 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలి. హమాస్ 240 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకుని గాజాలో ఉంచినందున ఈ ఒప్పందం అవసరమైంది. ఈ ఒప్పందం ప్రకారం బందీలు, ఖైదీలను విడుదల చేసే ప్రక్రియ నవంబర్ 24 నుండి ప్రారంభమైంది. హమాస్ 100 మందికి పైగా బందీలను విడుదల చేయగా ఇజ్రాయెల్ దాదాపు 200 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.

హమాస్ అదుపులోనే  ఇంకా 137 మంది

ఇజ్రాయెల్ పై దాడి చేసి పట్టుకున్న బందీల్లో 137 మంది బందీలు ఇంకా హమాస్ అదుపులోనే ఉన్నారు. వీరిలో 17 మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ బందీలను ఎప్పుడు విడుదల చేస్తారో ఎవరికీ తెలియదు. దాదాపు వారం రోజుల కాల్పుల విరమణ తర్వాత మళ్లీ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం నేటికీ కొనసాగుతోంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనేది చెప్పడం కష్టం. ఇటీవల కతార్ మరోసారి కాల్పుల విరమణపై మధ్యవర్తిత్వం వహించింది. అయితే  ఈ మధ్యవర్తిత్వం సక్సెస్ కాలేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!