AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bionic Girl: ఈ బాలికకు వింత వ్యాధి.. ఆకలి, నిద్ర, మాత్రమే కాదు దెబ్బలు తగిలినా తెలియదు..

ఈ అమ్మాయి ఒక ప్రత్యేకమైన జన్యు పరమైన వ్యాధితో బాధపడుతోంది. అంటే  క్రోమోజోమ్ 6 తొలగింపుగా గుర్తించారు. ఇది అత్యంత అరుదైన పరిస్థితి అని .. ఈ జన్యు లోపలం ఉన్నవారిలో నొప్పి, ఆకలి లేదా అలసట వంటి అనుభూతులు కలగవని చెప్పారు. కనుక ఒలివియా వాస్తవ పరిస్థితిలో దెబ్బలు తగిలితే అమ్మా అంటూ బాధపడడం, ఆకలి వేసినప్పుడు తినడం, అర్ధ రాత్రి వరకూ కష్టపడి అలసిన శరీరం సేద దీరడం కోసం నిద్రపోవడం వంటివి ఉండవు. ఊహించలేమని చెప్పారు. 

Bionic Girl: ఈ బాలికకు వింత వ్యాధి.. ఆకలి, నిద్ర, మాత్రమే కాదు దెబ్బలు తగిలినా తెలియదు..
Olivia
Follow us
Surya Kala

|

Updated on: Dec 08, 2023 | 9:52 AM

సృష్టిలో తరచి చూడాలే కానీ అనేక వింతలు విశేషాలు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రకృతిపై మానవుడు పై చేయి సాధించా అని భావించే సమయంలో సరికొత్త వింతను, విద్వంసాన్ని సృష్టించి మానవ మేధస్సుకు సవాల్ విసురుతూనే ఉంది. అలాంటి వింతల్లోనే వింత ఒకటి వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలిక చాలా అరుదైన వ్యాధితో బాధపడుతోంది. UKకి చెందిన ఒలివియా ఫార్న్స్‌వర్త్‌కు అరుదైన క్రోమోజోమ్ డిజార్డర్ ఉంది. దీని కారణంగా బాలికకు ఆకలి అంటే తెలీయదు. బాధపడదు లేదా నొప్పిని అఫీల్ అవ్వదు. అంతేకాదు  ఎక్కువ సమయం ఆ బాలిక నిద్రపోవాల్సిన అవసరం లేదు. ఒలివియాకు ఉన్న వింత వ్యాధి గురించి వైద్యుల దృష్టికి చేరగానే వారు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ప్రపంచంలో ఈ అమ్మాయికి మాత్రమే ఈ వ్యాధి ఉంది.

2016లో ఇంగ్లండ్‌లోని హడర్స్‌ఫీల్డ్‌లో ఏడేళ్ల ఒలివియాను కారు ఢీకొట్టి కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. అయితే ఆ తర్వాత జరిగిన విషయం షాకింగ్ గా నిలిచిపోయింది.

‘బయోనిక్ గర్ల్’ అని పిలుస్తారు

ఒలివియా తల్లి నిక్కీ ట్రెపాక్ మాట్లాడుతూ.. తన కూతుర్ని కారు బలంగా ఢీకొన్నప్పటికీ.. ఒలివియా ఏ మాత్రం బాధను వ్యక్తం చేయలేదని.. తాను పడిన చోట నుంచి హాయిగా లేచి అక్కడి నుండి వెళ్లిపోయింది. అప్పుడు తన కుమార్తె ఛాతీపై టైర్ గుర్తుతో పాటు.. శరీరంపై చాలా గాయాలు ఉన్నాయి. అయినప్పటికీ ఒలివియా ఎటువంటి బాధను ఫీల్ కాలేదు. అంతేకాదు కళ్ళల్లో భయం కనిపించలేదు. దీంతో అమ్మాయి సాధారణంగా ఫీల్ అయ్యే భయం కూడా లేకపోవడం వల్ల..  ‘బయోనిక్ గర్ల్’ అనే పేరు పెట్టారు.

ఇవి కూడా చదవండి

ఆ అమ్మాయికి ఈ వింత జబ్బు

హఫింగ్టన్ పోస్ట్ ప్రకారం ఈ అమ్మాయి ఒక ప్రత్యేకమైన జన్యు పరమైన వ్యాధితో బాధపడుతోంది. అంటే  క్రోమోజోమ్ 6 తొలగింపుగా గుర్తించారు. ఇది అత్యంత అరుదైన పరిస్థితి అని .. ఈ జన్యు లోపలం ఉన్నవారిలో నొప్పి, ఆకలి లేదా అలసట వంటి అనుభూతులు కలగవని చెప్పారు. కనుక ఒలివియా వాస్తవ పరిస్థితిలో దెబ్బలు తగిలితే అమ్మా అంటూ బాధపడడం, ఆకలి వేసినప్పుడు తినడం, అర్ధ రాత్రి వరకూ కష్టపడి అలసిన శరీరం సేద దీరడం కోసం నిద్రపోవడం వంటివి ఉండవు. ఊహించలేమని చెప్పారు.

అయితే ప్రమాదం సమయంలో ఒత్తిడి లేకుండా ఉండగలిగే ఆ బాలిక మానసిక పరిస్థితి ఎంటువంటి పరిస్థితుల నుంచి అయినా అద్భుతంగా రక్షించడంలో  ముఖ్యమైన పాత్ర పోషించిందని నమ్ముతారు. అయితే ఈ అరుదైన వ్యాధి లక్షణాలు.. ఒలివియా పుట్టిన కొద్ది నెలలకే కనిపించడం ప్రారంభించాయి. జుట్టు పెరగకపోవడం నుండి తీవ్రమైన కడుపు నొప్పి వరకు.. ఆమె తల్లి నిక్కీ ఎదుర్కొన్న క్షణాలను గుర్తుచేసుకుంది.

ట్రెపాక్ ప్రకారం ఒలివియా తొమ్మిది నెలల వయస్సులో పగటిపూట నిద్రపోవడం మానేసింది. అంతే కాదు చిన్నపిల్లల్లా ఏడవలేదు. ఆ వయస్సులోనే ఒలివియా కూడా తల్లి పాలు తాగడం మానేసింది.  అయితే అప్పుడు తన కుమార్తెకు తల్లిపాలంటే ఇష్టం లేదని తాను అనుకున్నాను,” అని ట్రెపాక్  చెప్పింది. అయితే దీని తర్వాత తినడం కూడా మానేసింది. అసలు ఎప్పుడూ ఒలివియా ఆకలి అని అడగదని చెప్పింది. మిగతా పిల్లలందరూ స్కూల్ లో తింటారు కాబట్టి  తన కూతురు కూడా పాఠశాలలో తింటుందని వెల్లడించింది.

మరిన్ని ట్రెండింగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..