Viral Video: పెళ్లిలో డ్యాన్స్‌తో సందడి చేసిన తాతగారు.. వృద్ధుడి స్టెప్స్ ముందు యువకుడు కూడా బలాదూర్..

జీవితాన్ని గడపడానికి రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. అన్ని సమస్యలు, బాధ్యతలను మోస్తూ ముందుకు సాగడం లేదా జీవితాన్ని సరదాగా గడుపుతూ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు వెళ్లడం అని అంటారు. కొందరు జీవితంలో ఏదైనా చేయగలరు. ఇటీవలి కాలంలో  అలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో ఎక్కువగా వైరల్ అవుతోంది.

Viral Video: పెళ్లిలో డ్యాన్స్‌తో సందడి చేసిన తాతగారు.. వృద్ధుడి స్టెప్స్ ముందు యువకుడు కూడా బలాదూర్..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Dec 07, 2023 | 10:43 AM

పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. దీంతో ప్రతి రోజూ సోషల్ మీడియాలో పెళ్ళికి సంబంధించిన రకరకాల వీడియాలు సందడి చేస్తున్నాయి. కొన్ని రకాల వీడియోలు పూర్తి వినోదాన్ని అందిస్తాయి. ఈ వీడియోలు నెటిజన్లను ఆకర్షించడమే కాదు ఒకరితోనొకరు పంచుకుంటున్నారు కూడా.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఓ  వీడియో తెరపైకి వచ్చింది. ఇది చూసిన తర్వాత ఎవరైనా హ్యాపీ ఫీల్ అవుతారు. అంతేకాదు వయసు అనేది కేవలం ఒక సంఖ్య అని అంటారు.

జీవితాన్ని గడపడానికి రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. అన్ని సమస్యలు, బాధ్యతలను మోస్తూ ముందుకు సాగడం లేదా జీవితాన్ని సరదాగా గడుపుతూ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు వెళ్లడం అని అంటారు. కొందరు జీవితంలో ఏదైనా చేయగలరు. ఇటీవలి కాలంలో  అలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి డ్యాన్స్ ను ఓ రేంజ్ లో చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

70-75 ఏళ్ల వృద్ధుడు పెళ్లి వేడుకలో యువకులతో కలిసి వేదికపై నృత్యం చేయడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. భోజ్‌పురి పాట విన్న వెంటనే వృద్ధుడి లోపల ఉన్న యువకుడు బయటికి వచ్చాడు. ఆపై స్టేజ్ మీద ఉన్న యువకులతో కలిసి ఓ రేంజ్ లో స్టెప్స్ వేశాడు. వృద్ధుడి డ్యాన్స్ ప్రతిభ ముందు యువకుల  ప్రదర్శన కూడా దిగదుడుపే అని చెప్పవచ్చు. ప్రదర్శన సమయంలో వృద్ధుడి ముఖంలో చిరునవ్వు చెక్కుచెదరకుండా ఉంది. అయితే భర్త డ్యాన్స్ చేస్తుంటే.. అతని భార్య అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అయితే తాత ఎవరి మాట వినకుండా తన మానాన తాను డ్యాన్స్ చేస్తున్నాడు.

ఈ వీడియో Xలో (@ChapraZila) పేరు గల ఖాతా నుండి పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత అందరూ ఏజ్ ఏజ్ అంటున్నారు.. ప్రతిభకు వయసుకు సంబంధం లేదు..  వినోదం సజీవంగా ఉంటేనే సెలబ్రిటీలు బతికి ఉంటారని కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..