AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్మైల్ ప్లీజ్.. సెల్ఫీ కోసం కుక్క ఫోజులు సూపర్బ్.. ఫన్నీ వీడియోపై ఓ లుక్ వేయండి

జంతువులకు సంబంధించిన సెల్ఫీలకు పోజులివ్వడం లేదా సెల్ఫీలను ఇష్టపడడం మీరు చూశారా? సాధారణంగా ఏ జంతువుకు సంబంధించిన సెల్ఫీలు ఇప్పటి వరకూ తీసుకోవడం చూసి ఉండరు. అయితే ఈ కుక్కకు సెల్ఫీలు తీసుకోవడం మాత్రమే ఇష్టం. కుక్క సెల్ఫీకి పోజులిచ్చిన ఓ అందమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఈ క్యూట్ డాగ్ మనకంటే బాగా ఫోటోకి పోజులివ్వగలదని నెటిజన్లు అంటున్నారు.

Viral Video: స్మైల్ ప్లీజ్.. సెల్ఫీ కోసం కుక్క ఫోజులు సూపర్బ్.. ఫన్నీ వీడియోపై ఓ లుక్ వేయండి
Selfie With Dog
Surya Kala
|

Updated on: Dec 03, 2023 | 7:43 PM

Share

దాదాపు ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన వ్యక్తులను లేదా తమ ప్రియమైన వారితో సెల్ఫీలు క్లిక్ చేయడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొందరికి రోజూ సెల్ఫీ తీసుకోకపోతే నిద్ర పట్టదు. అందుకే సెల్ఫీ పిచ్చి చాలా మందికి ఎక్కువగా ఉంటుంది. రకరకాల ఫోజులతో సెల్ఫీలను తీసుకుని సందడి చేస్తారు. అయితే ఎప్పుడైనా కుక్కలతో సహా మరే ఇతర జంతువులకు సంబంధించిన సెల్ఫీలకు పోజులివ్వడం లేదా సెల్ఫీలను ఇష్టపడడం మీరు చూశారా? సాధారణంగా ఏ జంతువుకు సంబంధించిన సెల్ఫీలు ఇప్పటి వరకూ తీసుకోవడం చూసి ఉండరు. అయితే ఈ కుక్కకు సెల్ఫీలు తీసుకోవడం మాత్రమే ఇష్టం. కుక్క సెల్ఫీకి పోజులిచ్చిన ఓ అందమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఈ క్యూట్ డాగ్ మనకంటే బాగా ఫోటోకి పోజులివ్వగలదని నెటిజన్లు అంటున్నారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

వీడియోలో ఒక మహిళ మొబైల్ ఫోన్ పట్టుకుని సెల్ఫీ క్లిక్ చేస్తున్నట్లు నటిస్తుంది. ఇక పక్కనే కూర్చున్న తన పెంపుడు కుక్కను బిగ్గరగా “బింగో సెల్ఫీ” అని పిలిచింది. సెల్ఫీ అనే పేరు వినగానే బింగో ఎంతో ఆనందంతో పైకి ఎగిరి.. లేడి భుజంపై రెండు కాళ్లు వేసి, తోక ఊపుతూ స్టైల్‌గా సెల్ఫీకి పోజులిచ్చింది.

ఈ అందమైన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. 628K వ్యూస్ ను,  38.4K లైక్స్ ను సొంతం చేసుకుంది. రకరకాల కామెంట్స్ చేశారు. ఒకరు “వావ్ ఈ కుక్క చాలా అందంగా ఉంది” అన్నారు. మరొక వినియోగదారు, “ఈ కుక్కకు ఇంగ్లీష్ బాగా అర్థం అవుతుంది, కాదా?” అని ఫన్నీ కామెంట్ రాశారు. చాలా మంది ఈ వీడియో క్యూట్‌గా ఉందని ప్రశంసించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..