AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Japa Mala: ఆధ్యాత్మికతలో సరికొత్త పోకడ.. డిజిటల్ జప మాల వైరల్.. అమెజాన్ లో లభ్యం

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో 'డిజిటల్ జపమాల' పై మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ఆన్‌లైన్ షాపింగ్ యాప్ 'అమెజాన్'లో ఈ డిజిటల్ జపమాల పరికరం అనేక రంగుల్లో లభిస్తుంది. వీటి ధర ఒకొక్కటి రూ. 227 ధర. ఈ వీడియోను 'లైఫ్‌ఆఫ్‌స్టార్‌డస్ట్' హ్యాండిల్ ద్వారా సోషల్ మీడియా సైట్ X (గతంలో ట్విట్టర్)లో  షేర్ చేశారు. ఆ పోస్ట్‌కి ఇప్పటి జనం జపమాలను కూడా డిజిటల్ గా మార్చేచారు అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

Digital Japa Mala: ఆధ్యాత్మికతలో సరికొత్త పోకడ.. డిజిటల్ జప మాల వైరల్.. అమెజాన్ లో లభ్యం
Spinner Digital Japa Mala
Surya Kala
|

Updated on: Dec 01, 2023 | 5:56 PM

Share

హిందూమతంలో దేవుడి పూజ, జపం సర్వ శ్రేష్టం. భగవంతుడి ఆరాధన సమయంలో జపం చేయడానికి వివిధ రకాల దండలను ఉపయోగిస్తారు. సనాతన సంప్రదాయంలో వివిధ దేవతలను పూజించడానికి వివిధ జప మాలలతో జపిస్తారు. చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకోవడానికి ప్రతిరోజూ లేదా కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో జపమాలతో మంత్రాలను జపిస్తారు. ఇందుకోసం వివిధ రకాలైన దండలను జపం కోసం ఉపయోగిస్తారు.

అయితే మారిన కాలంతో పాటు.. ఎన్నో రకాలుగా సాంకేతికంగా అభివృద్ధి చెందింది. కొత్త రకాల వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక కొత్తరకం జపమాలకు చెందిన వీడియో వైరల్ అవుతుంది. ఇందులో ‘జప మాల’ను ‘డిజిటల్ పూసల లెక్కింపు పరికరం’గా మార్చడం ద్వారా, వినియోగదారుడు పరికరాన్ని ప్రయత్నిస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. దాదాపు అన్ని మతాల్లో జపమాలను, దండలను ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ‘డిజిటల్ జపమాల’ పై మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ఆన్‌లైన్ షాపింగ్ యాప్ ‘అమెజాన్’లో ఈ డిజిటల్ జపమాల పరికరం అనేక రంగుల్లో లభిస్తుంది. వీటి ధర ఒకొక్కటి రూ. 227 ధర. ఈ వీడియోను ‘లైఫ్‌ఆఫ్‌స్టార్‌డస్ట్’ హ్యాండిల్ ద్వారా సోషల్ మీడియా సైట్ X (గతంలో ట్విట్టర్)లో  షేర్ చేశారు. ఆ పోస్ట్‌కి ఇప్పటి జనం జపమాలను కూడా డిజిటల్ గా మార్చేచారు అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

వైరల్ వీడియో చూడండి:

ఈ వీడియో తక్షణమే వైరల్‌గా మారింది. ఇంటర్నెట్‌లో రకరకాల కామెంట్స్ ను సొంతం చేసుకుంది ఈ వీడియో. చాలా మంది కొత్త పరికరాన్ని ఇష్టపడ్డారు. జపం చేసుకోవడానికి ఇది అనుకూలమైనది అని అంటున్నారు. మరికొందరు హిందువులు ‘రుద్రాక్ష’ పూసలతో జపం చేయాలనీ.. కనుక ఇది పనిచేయదని అంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటి నుంచి 496K వ్యూస్ సొంతం చేసుకుంది.

ఇలాంటివి “కొన్నింటిని చూసి అలాగే వదిలేయాలి,” రెండవ వ్యక్తి  “ఆ మాలలో 108 పూసలు ఉన్నాయని  వాటిని లెక్కించడం మాత్రమే కాదని అయితే వాటి సంఖ్య ఖచ్చితంగా తెలియదు, ”అని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..