మేనకోడలి పెళ్లిలో కాసుల వర్షం కురిపించిన మామ.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం.. వైరలవుతున్న వీడియో..

సత్బీర్ సొంతంగా క్రేన్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అంతేకాదు.. అతడు పెద్ద భూస్వామి కూడా.. సత్బీర్ తన స్వగ్రామంలోనే తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే, అతను ఎప్పుడూ తన సోదరికి అండగా ఉంటూ, అన్ని వేళలా సహాయం చేస్తూనే ఉంటాడు.. ఇలాంటి పరిస్థితుల్లో తన చెల్లెలి కూతురు పెళ్లి కోసం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేయటం పట్ల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మేనకోడలి పెళ్లిలో కాసుల వర్షం కురిపించిన మామ.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం.. వైరలవుతున్న వీడియో..
Niece's Wedding
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 01, 2023 | 6:16 PM

ఓ వ్యక్తి తన మేనకోడలు పెళ్లిలో ఎవరూ ఊహించని బహుమానం ఇచ్చాడు. దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆ వ్యక్తి తన వితంతువు సోదరి ఇంట్లో కరెన్సీ నోట్లను కుప్పగా పోశాడు. మేనకోడలు పెళ్లి కానుకగా ఏకంగా… ఒక కోటి, ఒక లక్ష, 11 వేల 101 రూపాయల నగదు బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు కోటి రూపాయల నగలు కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. హర్యానాలోని రేవారీ నగరంలో వెలుగులోకి వచ్చిన ఉదంతం ఇది. ఆ వ్యక్తి తన మేనకోడలు వివాహ వేడుకలో వరుడు, తోడిపెళ్లికూతురు, అతిథుల ముందు కోటి రూపాయల విలువైన నోట్ల కట్టలను కుమ్మరించాడు. ఇది చూసి అందరి కళ్లు బైర్లు కమ్మాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పెళ్లి చర్చనీయాంశమైంది.

ఈ విషయం రేవారి పక్కనే ఉన్న అసల్వాస్ గ్రామంలోనూ తీవ్ర సంచలనం రేపింది. అసల్వాస్ సత్బీర్ సోదరి వివాహం సిందర్‌పూర్‌లో జరిగింది. సత్బీర్ ఏకైక సోదరి భర్త చాలా కాలం క్రితం చనిపోయాడు. అతని సోదరికి ఒకే ఒక కుమార్తె ఉంది. ఇటీవల ఆమె వివాహం వైభవంగా జరిగింది. హిందూ ఆచారాల ప్రకారం, సత్బీర్ తన ఏకైక మేనకోడలి వివాహానికి కోటి రూపాయల విలువైన కరెన్సీ నోట్లను కానుక ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

సమాచారం ప్రకారం.. తన మేనకోడలు పెళ్లికి ముందు, సత్బీర్ తన సోదరుడిలా తన మేనకోడలి వివాహ పూజాది కార్యక్రమాలను నిర్వహించడానికి తన గ్రామ ప్రజలతో కలిసి తన సోదరి ఇంటికి వెళ్ళాడు. సాయంత్రం పెళ్లి క్రతువులు ప్రారంభం కాగానే అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సత్బీర్ తన సోదరి ఇంట్లో రూ.500 నోట్ల గుట్టను పేర్చటం చూసి వారంతా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. సత్బీర్ పూర్తి మొత్తం రూ.1 కోటి, 1 లక్షా, 11 వేల 101 చెల్లించాడు. దీంతో పాటు కోట్లాది రూపాయల విలువైన నగలు, ఇతర వస్తువులు కూడా ఇచ్చారు.

సత్బీర్ సొంతంగా క్రేన్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అంతేకాదు.. అతడు పెద్ద భూస్వామి కూడా.. సత్బీర్ తన స్వగ్రామంలోనే తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే, అతను ఎప్పుడూ తన సోదరికి అండగా ఉంటూ, అన్ని వేళలా సహాయం చేస్తూనే ఉంటాడు.. ఇలాంటి పరిస్థితుల్లో తన చెల్లెలి కూతురు పెళ్లి కోసం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేయటం పట్ల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..