ప్రపంచంలోనే అతిపెద్ద చీజ్‌ శాండ్ విచ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్‌ చేసింది.. ఎన్ని కిలోలో తెలుసా?

అధికారిక సైట్ కూడా ఈ కాల్చిన చీజ్ మునుపటి రికార్డ్ హోల్డర్ కంటే 35శాతం పెద్దదని పేర్కొంది. వీరికంటే ముందు ఒక జర్మన్ జంట ఇద్దరు వ్యక్తులు శాండ్‌విచ్‌ను అత్యంత వేగంగా తయారు చేసి ప్రపంచ రికార్డు ను నెలకొల్పారు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి కళ్లకు గంతలు కట్టుకుని, మరొక వ్యక్తి చేతులు ఉపయోగించకుండా కేవలం 40 సెకన్లలో శాండ్ విచ్ తయారు చేశారు. ఇప్పుడు ఈ అమెరికా వ్లాగర్స్ అతి పెద్ద శాండ్ విచ్ తయారు చేసి రికార్డు సృష్టించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద చీజ్‌ శాండ్ విచ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్‌ చేసింది.. ఎన్ని కిలోలో తెలుసా?
Largest Grilled Cheese Sand
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 01, 2023 | 5:03 PM

ప్రస్తుతం మనకు మార్కెట్లో అనేక రకాల శాండ్ విచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, వాటన్నింటిలోనూ చీజ్ శాండ్ విచ్‌కి భోజన ప్రియుల్లో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అయితే, తాజాగా ఇద్దరు యువకులు తయారు చేసిన అతిపెద్ద గ్రిల్డ్‌ చీజ్‌ శాండ్‌విచ్‌ ప్రపంచంలోనే అతి పెద్దదిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది..యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)కి చెందిన ఇద్దరు యువకులు యూట్యూబ్‌లో 1,00,000 మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్నారు. ఈ ఇద్దరు యువకులు తమ క్రియేటివిటీతో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రిల్డ్ చీజ్ శాండ్‌విచ్‌ను తయారు చేసి.. తమ మైలురాయిని చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా చేసిన వారి ప్రయత్నంలో వారు తమ పేరు మీద గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సంపాదించారు. ఈ జంట అక్టోబర్ 21న ఈ రికార్డును విజయవంతంగా పూర్తి చేశారు. అయితే వారి రికార్డ్ నవంబర్ 27న పబ్లిక్‌గా ధృవీకరించబడింది.

శాండ్‌విచ్ బరువు 189.9 కిలోలు

విస్కాన్సిన్ నుండి వరుసగా 11- 10 సంవత్సరాల వయస్సు గల ఎక్సోడస్, ఇగ్గీ చౌదరి 1.89 మీటర్ల కొలిచే భారీ శాండ్‌విచ్‌ను తయారు చేయడానికి వారి తల్లిదండ్రులు, ఇరుగు పొరుగువారు సహాయం చేశారు. వారు 1.89 మీటర్లు (6.2 అడుగులు), పొడవు 3.32 మీటర్లు (10.8 అడుగులు) పొడవు, 7 సెంమీ (2.7 అంగుళాలు) మందంతో ఒక పెద్ద శాండ్‌విచ్‌ను తయారు చేయగలిగారు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రకారం జెయింట్ స్లైస్‌లు ఇతర రకాల బ్రెడ్‌ల కంటే మెరుగ్గా వాటి నిర్మాణాన్ని నిలుపుకున్నామని ఆ ఇద్దరు యువకులు పేర్కొన్నారు. దిగువన ఉన్న బ్రెడ్ ‘స్లైస్’ ఓపెన్ ఫ్లేమ్స్‌పై ఫ్రై చేస్తూ.. పైభాగం బ్లో టార్చ్‌ని ఉపయోగించి ఉడికించారు. చీజ్ మొత్తం కరిగేలా, రెండు వైపులా శాండ్ విచ్ కావాల్సినంతగా కాలేలా దీనిని తయారు చేశారు. అయితే ఈ శాండ్ విచ్ బరువు 189.9 కిలోలుగా ఉండటం విశేషం.

ఇవి కూడా చదవండి

అధికారిక సైట్ కూడా ఈ కాల్చిన చీజ్ మునుపటి రికార్డ్ హోల్డర్ కంటే 35శాతం పెద్దదని పేర్కొంది. వీరికంటే ముందు ఒక జర్మన్ జంట ఇద్దరు వ్యక్తులు శాండ్‌విచ్‌ను అత్యంత వేగంగా తయారు చేసి ప్రపంచ రికార్డు ను నెలకొల్పారు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి కళ్లకు గంతలు కట్టుకుని, మరొక వ్యక్తి చేతులు ఉపయోగించకుండా కేవలం 40 సెకన్లలో శాండ్ విచ్ తయారు చేశారు. ఇప్పుడు ఈ అమెరికా వ్లాగర్స్ అతి పెద్ద శాండ్ విచ్ తయారు చేసి రికార్డు సృష్టించారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.., ప్రపంచంలోనే అతిపెద్ద పిజ్జా ఎలా తయారు చేయబడిందో యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత ఇద్దరు సోదరులు ఈ రికార్డ్ సృష్టించాలనే నిర్ణయానికి వచ్చారట. ఇక ఈ ఇద్దరు సోదరులు తయారు చేసిన చీజ్ శాండ్‌విచ్‌లు అందరూ హ్యాపీగా ఎంజాయ్‌ చేస్తూ తినటం ప్రారంభించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..