Most Expensive Hotel : భారతదేశంలోనే అత్యంత ఖరీదైన హోటల్ ఇదే.. ఇక్కడ ఒక రాత్రి బస చేయాలంటే…
ఈ హోటల్‌ని గతంలో ది చోము హవేలీ అని పిలిచేవారు. దీనిని 1727లో నిర్మించారు. దీనికి చోము చివరి రాజు ఠాకూర్ రాజ్ సింగ్ పేరు పెట్టారు. అయితే 1996లో యువరాణి జయేంద్ర కుమారి ఈ ప్యాలెస్‌ని హోటల్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇది చాలా ప్రత్యేకమైన హోటల్‌గా నిలిచిపోయింది. ఈ హోటల్ లోపలి భాగం ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. ఇందులో మొత్తం 50 విలాసవంతమైన గదులు ఉన్నాయి. ఒక్కో గది విశిష్టత ఒక్కోలా ఉంటుంది.
మీరు భారతదేశంలోని వేలకొద్దీ హోటళ్లను చూసి ఉంటారు. వాటిలో కొన్నింటిలో బస చేసి కూడా ఉంటారు. కొన్నిసార్లు మీరు కొన్ని హోటళ్లలో గదుల అద్దె చౌకగా ఉండొచ్చు. కొన్నిసార్లు అద్దె ఖరీదైనది కావచ్చు. కానీ, మీరు బడ్జెట్ ప్రకారం కొద్దిగా సర్దుబాటు చేసుకుని ఉండొచ్చు. కానీ దేశంలోని అత్యంత ఖరీదైన హోటళ్లలో ఒకటిగా పరిగణించబడే ఒక హోటల్ భారతదేశంలో ఉందని మీకు తెలుసా.? అయితే, ఇక్కడ ఛార్జీలు తెలిస్తే ధనవంతులపే కూడా షాక్ అయ్యేలా చేస్తుంది. అవును, ఈ రోజు మనం ఆ హోటల్ గురించి తెలుసుకోబోతున్నాం.. భారతదేశంలోని అత్యంత ఖరీదైన హోటళ్లలో జైపూర్ లో లోని ఒక హోటల్ ప్రసిద్ధి చెందింది. బహుశా మీరు ఒక రాత్రి బస ఖర్చును కూడా అంచనా వేయలేకపోవచ్చు..
దేశంలోనే అత్యంత ఖరీదైన హోటల్ జైపూర్‌లోని రాజ్ ప్యాలెస్….ఇది దేశంలోని అత్యంత ఖరీదైన హోటల్‌లలో ఒకటిగా చెబుతారు. దీని అందం ప్రపంచవ్యాప్తంగా ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ హోటల్ గురించి ప్రభుత్వం కూడా బెస్ట్ హెరిటేజ్ హోటల్ ఆఫ్ ఇండియాగా గుర్తింపునిచ్చింది. ఇది వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్ ద్వారా ఏడు సార్లు వరల్డ్స్ లీడింగ్ హెరిటేజ్ హోటల్ గా ఎంపికైంది. ఇంటర్నెట్‌లో అందిన సమాచారం ప్రకారం ఈ విషయాలను చెబుతున్నాం.
ఈ హోటల్‌ని గతంలో ది చోము హవేలీ అని పిలిచేవారు. దీనిని 1727లో నిర్మించారు. దీనికి చోము చివరి రాజు ఠాకూర్ రాజ్ సింగ్ పేరు పెట్టారు. అయితే 1996లో యువరాణి జయేంద్ర కుమారి ఈ ప్యాలెస్‌ని హోటల్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత కూడా ఇది చాలా ప్రత్యేకమైన హోటల్‌గా, లోపలి భాగం ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది.
ఇందులో 50 విలాసవంతమైన గదులు ఉన్నాయి..
హోటల్‌లో 50 విలాసవంతమైన గదులు నిర్మించబడ్డాయి. ఇవి మొఘల్ కాలం నాటి డిజైన్‌ను పోలి ఉంటాయి. ఇవి రాజులు, చక్రవర్తులు నివసించే హోటల్ గదులు. అంతే కాకుండా ఎన్నో ఏళ్ల నాటి చారిత్రక విశేషాలు ఇప్పటికీ ఈ హోటల్‌లో ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ నుండి ఎలెన్ పేజ్ వంటి చాలా మంది ప్రముఖులు ఈ హోటల్‌లో బస చేశారు. ఇక్కడ వివిధ రకాల గదులు ఉన్నాయి.
ధర రూ.60వేల నుంచి ప్రారంభమవుతుంది..
ఈ హోటల్‌లో గది అద్దె ఎంత అని మీరందరూ ఆశ్చర్యపోతారు. హోటల్‌లోని హెరిటేజ్, ప్రీమియర్ రూమ్‌లకు ఒక్క రాత్రి అద్దె దాదాపు రూ. 60 వేలు. ఇది చాలా తక్కువ అని మీకు తెలుసా..? హిస్టారికల్ సూట్ అద్దె గురించి తెలిస్తే ఇక అంతే సంగతి.. ఇక్కడ అద్దె రూ.77 వేలు. ప్రెస్టీజ్ సూట్‌కి ఒక రాత్రి అద్దె రూ. 1 లక్ష కంటే ఎక్కువ, ప్యాలెస్ సూట్‌కు ఒక రాత్రి అద్దె రూ. 5 లక్షల కంటే ఎక్కువ. ఇక్కడ అత్యంత ఖరీదైనది ప్రెసిడెన్షియల్ సూట్.. ఇక్కడ ఒక రాత్రి అద్దె రూ. 14 లక్షల కంటే ఎక్కువ.
రాజ్ ప్యాలెస్ ఎలా చేరుకోవాలి..
ఇది జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 13 కి.మీ దూరంలో ఉండగా, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 240 కి.మీ దూరంలో ఉంటుంది. ఇది జైపూర్ రైల్వే స్టేషన్ నుండి 7.9 కి.మీ దూరంలో ఉంది. మీరు ఇక్కడకు విమానంలో లేదా రోడ్డు మార్గంలో కూడా వెళ్లవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..